నితిన్ పై కుట్ర చేస్తుంది ఎవరు?

Seetha Sailaja
హీరో నితిన్ తాను నటించిన ‘హార్ట్ ఎటాక్' ఇటీవల విడుదలై బాక్సాఫీసు వద్ద మంచి ఫలితాలు సాధిస్తోందని తన సినిమాకు టాక్ కూడా బాగానే ఉందని చెపుతూ నితిన్ నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేసి సినిమాకు సంబంధించిన తన అభిప్రాయాలను పంచుకున్నాడు. తనకు హ్యాట్రిక్ విజయం వస్తే చూడలేని కొందరు ‘హార్ట్ ఎటాక్' విడుదలకు ముందు తన సినిమాపై కావాలని నెగెటివ్ ప్రాచారం చేసారని, ఇండస్ట్రీలో ఇటువంటి చెడు సంస్కృతి సాగుతోందని నితిన్ చెప్పుకొచ్చాడు. అదే విధంగా తన దైవం పవన్ కళ్యాణ్ అంటూ ఆయన గురించి కూడా కొన్ని విషయాలు మాట్లాడాడు. పవన్ కల్యాణ్ తనకు దైవం లాంటి వారనీ చెపుతూ పవన్ ఆదర్శంగా తీసుకునే తాను పరిశ్రమలోకి వచ్చాను అంటు పవన్ ను తాను మనస్ఫూర్తిగా ఆరాధిస్తాను అని అన్నాడు నితిన్. అదే విధంగా తన సినిమాల్లో ఏదో ఒక రకంగా ఆయన మార్కు ఉండేలా చూసుకుంటాను అని ఓపెన్ చెప్పాడు నితిన్. ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ఒక అన్‌హెల్దీ ట్రెండ్ నడుస్తోందనీ అంటు కావాలనే కొందరు కొన్నే సినిమాలపై నెగెటివ్ టాక్ ప్రచారం చేస్తున్నారని ఒక బాంబ్ పేల్చాడు నితిన్. అది కేవలం తన సినిమాలకు మాత్రమే కాకుండా ఇతర హీరోల సినిమాలకు కూడా ఇలానే ప్రచారం చేస్తున్నారని చెపుతూ ఇటువంటి నెగిటివ్ ప్రచారాలు వల్ల జీవితాలు నాశనం అవడమే కాకుండా అటువంటి నెగిటివ్ మాటలు విన్నప్పుడు తనకు విపరీతమైన ఏడుపు వస్తోందని మీడియా ముందు బాధ పడ్డాడు నితిన్.వరుస హిట్లతో తన రెమ్యూనరేషన్ పెంచానన్న వార్త తెరపై స్పందిస్తూ తాను ఎవరినీ తన పారితోషిక విషయంలో బాధించడం లేదని ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం కొందరు తన పై కక్ష కట్టి చేస్తున్న నెగిటివ్ ప్రచారం అన్నాడు. అయితే ఆ నెగిటివ్ ప్రచారం చేస్తున్నది ఎవరు అన్న విషయం పై క్లారిటీ ఇవ్వలేదు నితిన్. హీరోల పై వస్తున్న నెగిటివ్ ప్రచారం వారి సినిమాల పై ప్రభావం చూపెడుతుందా? మీ అభిప్రాయాలను మీ అభిమాన ఎపిహెరాల్డ్ తో షేర్ చేసుకోండి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: