ఛాన్స్ వస్తే బికినీతో కనిపించేందుకు రెడీ అంటోంది బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా. స్టోరీ డిమాండ్ చేస్తే బికినీ ధరించే విషయంలో వెనక్కి తగ్గేది లేదంటోంది. ఎంత ఎక్స్ పోజింగ్ చేస్తే... అన్ని అవకాశాలు వస్తాయని ఇప్పుడు హీరోయిన్లు ఫీలవుతున్నారు. తొలి సినిమాతోనే అందాల ఆరబోతకు రెడీ అవుతున్నారు. ఏ ఇండస్ట్రీలోనైనా సినిమా కథంతా హీరో చుట్టూనే తిరగుతూ... హీరోయిన్లను కేవలం ఆటబొమ్మల్లాగ మార్చేస్తోంది. దీంతో సినిమాల్లో అవకాశాలు రావాలన్నా... ఆడియన్స్ తమను గుర్తుంచుకోవాలన్నా... హీరోయిన్లు ఎక్స్ పోజింగ్ చేయడం తప్పనిసరిగా మారింది. అయితే చిట్టిపొట్టి డ్రెస్సులతో అభిమానులకు హార్ట్ ఎటాక్ తెచ్చే హీరోయిన్లు... స్క్రిప్ట్ డిమాండ్ చేసింది కాబట్టే అందాలు చూపించమనడం కామన్గా మారింది. ఇప్పుడు పరిణీతి చోప్రా కూడా అదే బాటలో పయనిస్తున్నట్లు కనిపిస్తోంది.
టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కజిన్ గా ఇండస్ట్రీకి వచ్చిన పరిణీతి... షార్ట్ టైమ్ లోనే తానేంటో ప్రూవ్ చేసుకుంది. తొలి సినిమా లేడీస్ వర్సెస్ రిక్కీ బెహాల్ తోనే పరిణీతి బాలీవుడ్ని ఆకట్టుకుంది. అయితే నటిగా ఎలాంటి లిమిట్స్ పెట్టుకోలేదనీ... స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే ఇంటిమేట్ సీన్లలోనూ నటిస్తానని క్లియర్గా చెప్పింది. ఇష్కజాదే సినిమాలో ఇప్పటికే రెచ్చిపోయి నటించింది పరిణీతి. హీరో అర్జున్ కపూర్ తో వేడి పుట్టించే సన్నివేశాల్లో జీవించేసింది. లాస్ట్ ఇయర్ వచ్చిన శుద్ దేసి రొమన్స్ సినిమాలో కూడా హాట్ కిస్ లు పెట్టిన ఈ చిన్నది ఇక టూ పీస్ డ్రెస్ కి కూడా రెడీ అవ్వబోతుందని సమాచారం. అయితే అవన్నీ కథ ప్రకారం వచ్చాయి తప్ప... తానేం ఎక్స్ పోజింగ్ చేయలేదని అమాయకంగా మాట్లాడుతోంది.
నెక్స్ట్ మూవీ... కిల్ దిల్లో బికినీతో కనిపించేందుకు పరిణితి రెడీ అవుతోందంటూ బీటౌన్లో పుకార్లు వినిపిస్తున్నాయి. బికినీకి సూటయ్యేలా బాడీని షేప్ చేస్తోందని... ఎక్సర్సైజ్ చేస్తూ బరువు తగ్గుతోందని తెలిసింది. అయితే పరిణితి మాత్రం అవన్నీ రూమర్సేనంటూ కొట్టిపారేస్తోంది. హెల్దీగా ఉండేందుకే బరువు తగ్గిస్తున్నానని చెప్పుకొస్తోంది. మొత్తానికి అందరి హీరోయిన్లలాగే పైకి మాట్లాడుతున్నా... పరిణితి కూడా త్వరలోనే బికినీ వేయడం ఖాయమంటున్నారు బీటౌన్ ప్రేక్షకులు.
పరిణితి చోప్రా బికినీ వేస్తే ఎలా ఉంటుందో మీ స్పందన తెలియచేయండి..?
మరింత సమాచారం తెలుసుకోండి: