ఝాన్సీ జీవితంలో చేదు అనుభవాలు..!
ఝాన్సీ .. జోగినాయుడు ఇద్దరూ కూడా బుల్లితెరపై మంచి క్రేజ్ తెచ్చుకుని ఆ తరువాత వెండితెరకి వెళ్లినవారే. కెరియర్ ఆరంభంలో వివాహం చేసుకున్న ఈ ఇద్దరూ, ఆ తరువాత కాలంలో విడిపోయారు. అయితే వారెందుకు విడిపోయారన్నది మాత్రం అతి కొద్ది మందికే తెలుసు. ఓ ఇంటర్వ్యూలో తమ మధ్య వివాదం గురించి జోగినాయుడు మాట్లాడుతూ, `ఝాన్సీ .. నేను, ఝాన్సీ ప్రేమించి పెళ్లి చేసుకున్నాము. 8 సంవత్సరాల పాటు మా వైవాహిక జీవితం సాఫీగా సాగిపోయింది. ఎప్పుడైతే సరదాలు .. విలాసాల విషయంలో ఇతరులతో పోల్చుకోవడం మొదలుపెడతామో, అప్పుడే జీవితం నాశనమవుతుంది. ఇలాంటి అంశాలు మా మధ్య చోటుచేసుకోవడం వల్లనే గొడవలు మొదలయ్యాయి. ఆమె నా నుంచి విడిపోవడానికి కారణం ఆర్ధికపరమైన విషయాలే. ఆమె కోసం 8 సంవత్సరాలు ఎదురుచూసి, ఆ తరువాతే మరో పెళ్లి చేసుకున్నాను` అని చెప్పుకొచ్చాడు జోగి నాయుడు. అయితే ఈ విషయంలో ఝాన్సీ వాదన మరోలా ఉంది. తన జోగినాయుడు తనను మానసికంగా ఇబ్బంది పెట్టేవాడని అందుకే తనతో కలిసి జీవితాన్ని కొనసాగించలేకపోయానని పలు సందర్భాల్లో వివరించింది ఝాన్సీ. అంతేకాదు విడాకుల విషయంలో కూడా జోగినాయుడు ఎంతో ఇబ్బంది పెట్టాడని చెప్పింది.