రజినీకాంత్ పై ఆయన సీరియస్ అయ్యాడు.. కారణం ఏంటో తెలుసా?

Edari Rama Krishna

సూపర్ స్టార్ రజినీకాంత్ ఎట్టకేలకు పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్నారు. రాజకీయ పార్టీని ఏర్పాటు చేయబోతున్నట్టు ఆయన తెలిపారు. అయితే తాను కేవలం పార్టీకి అధ్యక్షుడిగా మాత్రమే ఉంటానని అన్నారు. తమ పార్టీ గెలిస్తే.. ఓ మంచి విద్యావంతుడు, సమర్థుడిని ఎంచుకొని ముఖ్యమంత్రిని చేస్తామని అన్నారు.  రాజకీయాల్లోకి యువరక్తం రావాలన్న రజిని.. పార్టీలో 65 శాతం సీట్లను వారికే ఇస్తున్నట్టు స్పష్టం చేశారు. మక్కల్ మంద్రం ఆఫీసు బేరర్లలతో రజినీకాంత్ భేటీ సందర్బంగా ఈ వ్యాఖ్యలు చేశారు.  వ్యవస్థలను మార్చుతామన్న లక్ష్యంతోనే రాజకీయాల్లోకి వస్తున్నానని అన్నారు.

 

అంతే కాదు తనకు పదవుల కోసం ఆశపడే నేతలు వద్దని.. ప్రజలకు మనస్ఫూర్తిగా సేవ చేయాలనే సంకల్పం ఉన్నవారే తన పార్టీలోకి రావాలని అన్నారు.  రాజకీయాలను అన్ని పార్టీలు వ్యాపారంగా మార్చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌పై ఆ రాష్ట్ర party OF INDIA' target='_blank' title='సీపీఐ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ముత్తరసన్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయాలపై నిన్న రజనీ ప్రకటన  చేసిన రజినీకాంత్ పై ఆయన చిందులు వేశారు. అసలు పార్టీ గురించే ప్రస్తావించలేదు.. పార్టీ సిద్దాంతాల గురించే చర్చించలేదు.. కానీ తాను మాత్రం వేదాలు వల్లేస్తున్నారని అన్నారు.

 

తన వెంట సమర్థులైన నాయకులు లేరన్న కారణంతో ఇతర పార్టీల నుంచి వచ్చే వారికి అవకాశం కల్పిస్తానని చెప్పడం పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడమే అవుతుందన్నారు.  ఒక పార్టీ నిలబడాలంటే పునాధులు గట్టిగా ఉండాలి.. అంతే కానీ ఇతర పార్టీ నేతలపై ఆధారపడి రాజకీయాలను సమర్థవంతంగా ఎవరూ నడపలేరు అని అన్నారు.  అంతే కాదు అలాంటి వాటిని ప్రోత్సహించడం కూడా రాజకీయ లక్షణాలు కావలని అన్నారు.  పార్టీకి, ప్రభుత్వానికి వేర్వేరు నేతలన్న రజనీ.. ఆ ప్రకటనేదో పార్టీని ప్రకటించిన తర్వాత చేస్తే బాగుండేదని అన్నారు. రజనీకాంత్ నిద్రపోడని, ఇతరులనూ నిద్రపోనివ్వడని మండిపడ్డారు.  మొన్నటి వరకు బీజేపీకి మద్దతు పలికిన ఆయన ఇప్పుడు కొత్త పార్టీ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్ని అన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: