పవన్ ఫ్యాన్స్ కు గుండెలు పగిలే షాకింగ్ న్యూస్..

Murali

పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటే అభిమానుల్లో ఆశలు రెట్టింపై పోతూంటాయి. వారి ఆనందం, ఆశ సోషల్ మీడియాలో చూడాల్సిందే. రెండేళ్ల గ్యాప్ తర్వాత వస్తున్న వకీల్ సాబ్ పై అంచనాలు ఇదే స్థాయిలో ఆకాశాన్నంటుతున్నాయి. కేవలం ఫస్ట్ లుక్ రిలీజైనందుకే వారు చేసిన హడావిడి టాక్ ఆఫ్ ది స్టేట్ అయింది. మరి సినిమా రిలీజ్ కు వారి ఆనందాన్ని లెక్కకు మించి అంచనాలు వేసుకోవాల్సిందే. పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ పై వారిని షాక్ కు గురిచేసే వార్త ఒకటి రౌండ్ అవుతోంది.

 

 

వకీల్ సాబ్ ను మే 15న విడుదల చేస్తున్నామని నిర్మాత దిల్ రాజు ఎప్పుడో ప్రకటించాడు. దీంతో పవన్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. మే నెలా.. త్వరగా రావమ్మా.. అంటూ సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఇప్పుడీ సినిమా వాయిదా పడే అవకాశం ఉందంటున్నారు. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలకు నగారా మోగడం, నామినేషన్ల డేట్ కూడా ఈరోజుతో ముగియడం జరిగిపోతోంది. ఎన్నికల వేడి మొదలవడంతో పవన్ ఎన్నికల ప్రచారానికి వెళ్లడానికి సిద్ధపడ్డాడని అంటున్నారు. ఇదే నిజమైతే సినిమా షూటింగ్ కొంత ఆలస్యమయ్యే అవకాశం ఉందంటున్నారు. మిగిలిన పార్టీలకు వారి నాయకులు వెళ్తే సరిపోతుంది. కానీ.. జనసేనలో పవన్ మాత్రమే కీలక నాయకుడు.

 

 

దీంతో మళ్లీ భారమంతా పవన్ పైనే మోయాల్సి ఉంటుందని అంటున్నారు. ఇదే నిజమైతే జనసేన తరపున ఎన్నికల్లో నిలబడే వారందరికీ పవన్ సపోర్ట్ కావాల్సిందే. ఈ కారణంతో సినిమా విడుదలయ్యే అవకాశం ఉందంటున్నారు. దీనిపై అఫిషియల్ అనౌన్స్ మెంట్ దిల్ రాజు నుంచి రావాల్సిందే. ప్రస్తుతం ఈ వార్త ఫిలిం సర్కిల్స్ లో రౌండ్ అవుతోంది. ఈ వార్త నిజమైతే పవన్ అభిమానులు షాక్ కు గురవుతారనడంలో సందేహం లేదు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: