అల్లు అర్జున్ హీరోయిన్ కి పెళ్లి అయిపొయింది

Kothuru Ram Kumar

అల్లు అర్జున్ సరసన హీరోయిన్ గా నటించిన షీలా కౌర్ అందరికి గుర్తుండే ఉంటుంది. తన నటనతో తెలుగు ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. ఇంకా శిలా కౌర్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ భాషలలో హీరోయిన్ గా నటించింది. ఈ భామకు మంచి సినిమాలే వచ్చినప్పటికీ ఆమెకు పెద్దగా పేరు తెచ్చి పెట్టలేదు. ఆమె అంతకు ముందు చైల్డ్ ఆర్టిస్ట్ గా 20 కి పైగా సినిమాల్లో నటించింది.

 

తాజాగా షీలా కౌర్ పెళ్లి పీటలు ఎక్కింది. ప్రముఖ వ్యాపారవేత్త సంతోష్ రెడ్డిని పెళ్లాడింది షీలా. బుధవారం నాడు చెన్నైలో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరి వివాహం సింపుల్‌గా జరిగినట్టు తెలుస్తోంది. ఈ ముద్దుగుమ్మ గత కొద్దీ రోజులుగా సినిమాలకు దూరమైంది. సినీ ఇండస్ట్రీ నుండి పలువురు ఆమెకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు. 

 

ఇక తెలుగులో నవదీప్ హీరోగా వచ్చిన సీతాకోకచిలుక సినిమాతో హీరోయిన్ గా తెలుగు చిత్ర పరిశ్రమకి పరిచయం అయింది. అల్లు అర్జున్‌తో ‘పరుగు’, ఎన్టీఆర్‌తో ‘అదుర్స్’ రామ్‌తో ‘మస్కా’ చిత్రాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మకు మెల్లగా ఆఫర్స్ తగ్గిపోవడంతో చివరిగా బాలయ్య ‘పరమవీర చక్ర’ సినిమాలో నటించింది. వీటితో పాటు హలో ప్రేమిస్తారా, రాజు భాయ్, సీతాకోక చిలుక తదితర చిత్రాలతో పాటు కన్నడ, మళయాలంలో పాతికకి పైగా చిత్రాల్లో నటించింది షీలా.

 

అయితే ఆమెకు అన్ని భాషల్లోనూ ఆఫర్స్ బాగానే వచ్చినప్పటికీ సరైన హిట్ పడకపోవడంతో షీలా మెల్ల మెల్లగా సినిమాలకు దూరమైంది. ఈ మధ్య కాలంలో ఆమె బాగా బక్కచిక్కి గుర్తుపట్ట లేనంతగా కనిపించిన ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇచ్చిన తరువాత సంతోష్ రెడ్డితో రియల్ లైఫ్ వైఫ్‌గా మారి సర్ ప్రైజ్ చేసింది షీలా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: