ఓహో.. రష్మీ జబర్దస్త్ ఎంట్రీ వెనుక అనసూయ కథ ఇంత ఉందా?

Durga Writes

రష్మీ గౌతమ్.. ఇప్పుడు టాప్ యాంకర్స్ లిస్ట్ లో ఈమె పేరు ఖచ్చితంగా పైనే ఉంటుంది. ఎందుకంటే రష్మికి ఉన్న ఫాలోయింగ్ అలాంటిది మరి. రష్మీ చిన్నవయసులోనే ఇండస్ట్రీలో అడుగు పెట్టింది.. కానీ ఎవరు పట్టించుకోలేదు.. అవకాశాలు కోసం చెప్పులరిగేలా తిరిగి తిరిగి అలసిపోయింది కూడా.. అయన ఏలాంటి అవకాశాలు రాలేదు.. 

 

అప్పట్లో స్టార్ హీరో అయినా ఉదయ్ కిరణ్ సినిమాల్లో నటించిన.. ఆ తర్వాత స్టార్ కుటుంబం నుండి వచ్చిన హీరో సినిమాలో నటించిన పెద్దగా ఉపయోగం లేదు. అలాంటి రష్మీకి ప్రస్తుతం ఇంత స్టార్ ఎలా వచ్చింది అనుకుంటున్నారా? అసలు మీరు రష్మిని జబర్దస్త్ లో కాకుండా ఎప్పుడైనా ఎక్కడైనా గమనించారా?

 

లేదు కదా! అసలు రష్మీ గౌతమ్ జబర్దస్త్ కు వచ్చాకే ఇంత క్రేజ్ సంపాదించింది అంటే నమ్మండి. ఆమెకు ఎక్కడ అవకాశాలు లేని సమయంలో జబర్దస్త్ ఆమెను ఆదుకుంది. ఆ అవకాశంను ఎంత అద్భుతంగా ఉపయోగించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. మంచి స్టార్ యాంకర్ లా ఎదిగింది. సినిమాల్లో నటించింది.. ఇప్పుడు ఢీ షో లో కూడా చేస్తుంది.. 

 

అయితే ఇన్ని అవకాశాలు రావడానికి కారణం ఎవరో తెలుసా? అనసూయనే అంట.. ఎలా అనుకుంటున్నారా? అప్పట్లో జబర్దస్త్ లో యాంకర్ గా అనసూయ చేసేది.. ఇప్పుడు కూడా చేస్తుంది అనుకోండి.. అయితే అప్పుడు ఓన్లీ జబర్దస్త్ కదా. అందులో అనసూయ యాంకర్ గా వ్యవహరించేది. అయితే ఆ సమయంలోనే ఆమె ప్రెగ్నెంట్ అవ్వడంతో కొన్ని నెలలు గ్యాప్ తీసుకున్న తర్వాత ఆమె మళ్లీ యాంకర్ గా వ్యవహరించింది. అయితే ఆ గ్యాప్ లో రష్మీ తన యాంకరింగ్ తో ఆకట్టుకొని మంచి అవకాశాలను సాధించి ప్రస్తుతం స్టార్ యాంకర్ గా కొనసాగుతుంది.           

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: