హాలీవుడ్.. బాలీవుడ్ .. మాలీవుడ్ పైనే.. టాలీవుడ్ లో లేదు..!

NAGARJUNA NAKKA

కరోనా ఎఫెక్ట్ హాలీవుడ్.. బాలీవుడ్.. చివరకు మాలీవుడ్ పై ఉన్నా.. దాని ప్రభావం టాలీవుడ్ పై కనిపించడం లేదు. చాలా సినిమాలు షూటింగ్ రద్దు చేసుకున్నాయి. జేమ్స్ బాండ్ సినిమా నుంచి మోహన్ లాల్ నటించిన మరక్కార్ వరకు చాలా సినిమాలు వాయిదాపడ్డాయి. అయితే.. తెలుగులో మాత్రం ముందుగా ఎనౌన్స్ చేసిన డేట్స్ కే సినిమాలన్నీ వస్తున్నాయి. ఆర్థిక కారణాల వలన వాయిదా పడటం తప్ప.. కోలీవుడ్ కరోనాను ధీటుగా ఎదుర్కొంటోంది. 


కరోనా దెబ్బకు మాలీవుడ్ నష్టపోయింది. ఈ నెలంతా థియేటర్స్ మూసివేయాలని కేరళ సినిమా ఇండస్ట్రీ భావించింది. దీంతో మోహన్ లాల్ 100కోట్ల బడ్జెట్ మూవీ మరక్కాల్ వాయిదా పడింది. అనుకున్న డేట్స్ ప్రకారం రిలీజ్ చేయాలా వద్దా అని కోలీవుడ్ ఆలోచిస్తోంది. 


వాయిదా అనే మాటకు చోటు లేకుండా.. ముందుగా ప్రకటించిన డేట్స్ కే తెలుగు సినిమాలన్నీ దాదాపుగా వస్తున్నాయి. కరోనా ఎఫెక్ట్ కారణంగా వాయిదా పడుతుందన్న వార్తలను చిత్రవర్గాలు ఖండిస్తూ.. మరోసారి రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశాయి. రామ్, కిషోర్ తిరుమల కాంబినేషన్ మూవీ రెడ్ ఏప్రిల్ 9న రిలీజ్ అంటూ మూడు నెలల క్రితమే ఎనౌన్స్ చేశారు. కరోనా కారణంగా వాయిదా పడుతుందన్న వార్తను ఖండిస్తూ.. అనుకున్న టైమ్ కే వస్తున్నామని నిర్మాత ఎనౌన్స్ చేశారు. 


మార్చి 25నే వస్తున్న ఒరేయ్ బుజ్జిగా టీమ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించింది. ఇదే రోజు నాని, ఇంద్రగంటి మోహన్ కృష్ణ మూవీ వి రిలిజ్ అవుతోంది. కాంపిటీషన్ నుంచి బుజ్జిగాడు తప్పుకుంటాడన్న అభిప్రాయం కూడా మీడియాలో ఉంది. వీటన్నింటికీ క్లారిటీ ఇచ్చారు. 


కరోనా కారణంగా మా సినిమా వాయిదా పడటం లేదు. అనుకున్న డేట్ కే వస్తున్నామని నిర్మాతలందరూ ప్రకటించాల్సి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఎఫెక్ట్ తక్కువే. దీంతో వాయిదా జోలికి వెళ్లడం లేదు. టెన్త్.. ఇంటర్ ఎగ్జామ్స్ పూర్తి కావడంతో.. నెలాఖరుకు సమ్మర్ సీజన్ మొదలవుతుంది. 25న మూడు సినిమాలు వి.. ఒరేయ్ బుజ్జిగా..30రోజుల్లో ప్రేమించడం ఎలా పోటీ పడుతున్నాయి. 

ఏప్రిల్ 2న ఉప్పెన.. నిశ్శబ్దం సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తేజు తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్న ఉప్పెనను మార్చే ఉద్దేశంలో లేరు. అదే రోజు అనుష్క సినిమా నిశ్శబ్ధం వస్తున్నా ఎవరూ తగ్గడం లేదు. 

ఆర్థిక కారణాలు, బిజినెస్ కాక వాయిదా పడాలి తప్పితే.. తెలుగు సినిమాను కరోనా అడ్డుకునే పరిస్థితి లేదు. మార్చి ఏప్రిల్ లో యంగ్ హీరోల సందడే ఎక్కువ. ఎవరూ వెనక్కి తగ్గే ఉద్దేశంలో లేరు. మహానటి తర్వాత కీర్తి సురేష్ నటిస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ మిస్ ఇండియా 17న రిలీజ్ అవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: