శ్రీను వైట్ల సక్సెస్ కావటానికి ఆ సంఘటనే కారణమట!

Murali
సినిమాల్లో అవకాశాలు సంపాదించాలని ఎంతో మంది ఔత్సాహికులు తమ ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటారు. ఒకొక్కరికి కధలు రాసే కళ ఉంటే మరికొందరికి కొన్ని దృశ్యాలు ఇన్ స్పిరేషన్ గా నిలుస్తాయి. వారి టాలెంట్ ను ప్రూవ్ చేసుకోవటానికి ఎన్నో ఆఫీస్ ల చుట్టూ తిరుగుతూంటారు. మరికొందరు దర్శకుల చుట్టూ తిరుగుతూంటారు. అలా ఇండస్ట్రీలో దర్శకుడిగా ఎదిగిన శ్రీను వైట్లకు కూడా ఓ దృశ్యం తను సక్సెస్ ఫుల్ దర్శకుడు కావటానికి ఇన్ స్పిరేషన్ గా నిలిచింది.

తొంభై దశకం చివర్లో శ్రీను వైట్ల దర్శకుడిగా మారాడు. మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన నీకోసం సినిమాతో దర్శకుడిగా మారాడు. ఆ సినిమా హిట్ అయింది. కానీ అవకాశాలు అదే విధంగా తనకు క్యూ కట్టలేదు. మరిన్ని అవకాశాలు కోసం ప్రయత్నిస్తున్న శ్రీను వైట్ల ఓసారి తిరుమల స్వామి దర్శనానికి వెళ్లాడట. ఆ సమయంలో తనకు రూమ్ దొరకని పరిస్థితి ఉన్నప్పుడు.. అక్కడే ఉన్న కొందరు తన పరిస్థితి తెలుసుకుని తను రూమ్ లో ఉండేందుకు అవకాశం ఇచ్చారట. ఆ సంఘటన తనను ఆలోచనలో పడేసిందని ఈ సంఘటన గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. తానెవరో తెలీకపోయినా చలిలో ఇబ్బంది పడుతున్న తనకు రూమ్ షేర్ చేసుకునే అవకాశం ఇవ్వడం గొప్ప విషయమని చెప్పుకొచ్చాడు.

ఆ సంఘటన ఆధారంగానే తాను ఆనందం సినిమా కథ రాసుకున్నానని చెప్పుకొచ్చాడు. పాజిటివ్ థింకింగ్ ఉంటే దేన్నైనా సాధించొచ్చు అనే పాయింట్ చుట్టూనే ఆ సినిమా కథను రాసుకున్నాడట. ఆరోజు తిరుమలలో తన గురించి పాజిటివ్ గా ఆలోచించబట్టే నేనెవరో తెలీకపోయినా రూమ్ షేర్ ఇచ్చారని వారి ఇన్ స్పిరేషనే ఆనందం సినిమా అన్నాడు. ఆ సినిమాతోనే తాను టాప్ డైరక్టర్ గా ఎదిగానని ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: