'ఆచార్య' నో చెప్పిన అనుష్క.. ఇక మళ్ళీ ఆ హీరోయినే దిక్కా..?
మెగాస్టార్ చిరంజీవి కి సంబంధించిన వార్త రోజుకొకటి సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్లో ఆచార్య సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే సక్సెస్ఫుల్ దర్శకుడితో మెగాస్టార్ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమా మెసేజ్ ఓరియెంటెడ్ గా తెరకెక్కుతున్నట్లు తెలుస్తోంది. కాగా మెగాస్టార్ కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు గత కొంతకాలంగా హీరోయిన్ సమస్య వెంటాడుతూన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరిని సెలెక్ట్ చేయాలి అనే దానిపై ఎన్నో చర్చలు జరిపిన తర్వాత చివరికి త్రిషను సినిమాలో హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు.
ఇక ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ.. కొన్ని విభేదాల కారణంగా చిరు సార్ సినిమా నుంచి తాను తప్పుకుంటున్నాను అంటూ సోషల్ మీడియా వేదికగా త్రిష ప్రకటించడం చర్చనీయాంశంగా మారింది. ఇక త్రిష ఆచార్య సినిమా నుంచి అర్ధాంతరంగా తప్పుకోవడంతో... మళ్లీ చిరు సినిమాకి హీరోయిన్ సమస్య మొదలైంది. అయితే ఆచార్య సినిమా నుంచి హీరోయిన్ గా త్రిష తప్పుకోవడంతో ఆమె స్థానంలో... అనుష్క ను తీసుకోవాలని అనుకుంటున్నారట చిత్ర బృందం. ప్రస్తుతం నిశ్శబ్దం అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది అనుష్క. త్రిల్లర్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా అనుష్క అయితే చిరంజీవికి సరసన సరిగ్గా సరిపోతుందని అనుకుంటున్నారుట చిత్రబృందం .
కానీ ప్రస్తుతం అనుష్క బిజీ ఉండడంవల్ల డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆచార్య సినిమాకు నో చెప్పిందట స్వీటీ. దీంతో ఖైదీ నెంబర్ 150 సినిమాలో చిరంజీవి సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న కాజల్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం కాజల్ తో సంప్రదింపులు కూడా జరుపుతున్నారట. ఇక అన్నీ కుదిరితే కాజల్ చిరంజీవి ఆచార్య సినిమాల్లో నటించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం కాజల్ కెరియర్ కూడా కాస్త అయోమయం లోనే ఉంది కాబట్టి చిరంజీవి సినిమాలో నటించేందుకు ఒప్పుకుంటే కాజల్ కెరీర్ కూడా ప్లస్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. దీంతో కాజల్ కూడా చిరుతో సినిమాకి అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక దీనిపై చిత్ర బృందం నుంచి అఫీషియల్ ప్రకటన రావాల్సివుంది.