కాస్టింగ్ కౌచ్ అంటూ అరాచకం...!
సినీ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఎన్ని లోల్లులు, గొడవలు చేసిన వాటితో మాకేం సంబంధం లేదంటూ.. వాళ్ళ పని వారు చేసుకుని పోతుంటారు. ఇలా ఎంత మందిపై కేసులు పెట్టినా విచారణలు చేపట్టి ఎంతమందికి బుద్ధి చెప్పినా మాత్రం అసలు మారటం లేదు. క్యాస్టింగ్ కౌచ్ అంటూ.. తెలుగు ఇండస్ట్రీలో శ్రిరెడ్డి గొంతెత్తి గొడవలు సృష్టించింది. కానీ ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతునే ఉన్నాయి. తాజాగా ఇప్పుడు ఇలాంటి ఘటన ముంబైలో చోటుచేసుకుంది. ఒక క్యాస్టింగ్ డైరెక్టర్ సాటి క్యాస్టింగ్ డైరెక్టర్ గర్ల్ ఫ్రెండ్ ప్రైవేట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. దీనిని బట్టి అర్దం అవుతుంది. సినీ ఇండస్ట్రీలో అమ్మాయిలకు సరైన గౌరవం దక్కడం లేదని.
కొద్దిరోజుల క్రితం ముంబైకి చెందిన ఒక నటి సినిమా అవకాశాల కోసం కొన్ని స్టూడియోల తిరిగింది. తనకు ఏమన్నా అవకాశాలు వస్తాయేమో అని విశ్వప్రయత్నాలు చేస్తుంది. సరిగ్గా ఇదే టైంలో ఆమె ప్రైవసీ ఫోటోలు నెట్లో ప్రత్యక్షమయ్యే సరికి ఆ నటి దిగ్బ్రాంతికి గురై పోలీసులను ఆశ్రయించింది. అసలు విషయానికి వెళ్తే.. మహావీర్ తక్ ఉరఫ్ నకుల్ - ప్రస్తుత బాధితురాలి బాయ్ ఫ్రెండ్ ఇద్దరు కలిసి క్యాస్టింగ్ డైరెక్టర్స్ గా పనిచేస్తున్నారు. అయితే ఒక ఒప్పందం ప్రకారం నటి బాయ్ ఫ్రెండ్ మహావీర్ కి 3లక్షలు చెల్లించాల్సి ఉంది.
నటి బాయ్ ఫ్రెండ్ ను పని పూర్తి అవలేదని 3లక్షలు తిరిగివ్వాలని మహావీర్ అడిగాడు. ఏమి స్పందించక పోవడంతో మహావీర్ నటి తన బాయ్ ఫ్రెండ్ మొబైల్ ని దొంగిలించాడు. అనంతరం ఆ మొబైల్ లో ఉన్న తన గర్ల్ ఫ్రెండ్(నటి) ప్రైవసీ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు. ప్రస్తుతం మహావీర్ పోలీసుల కస్టడీలో ఉన్నట్లు సమాచారం. కానీ ఒకరు చేసిన తప్పుకు మరొకరు బలి అవ్వడం అంటే ఇదేనేమో. బాయ్ ఫ్రెండ్ చేసిన తప్పుకి నటి తంటాలు పడుతుంది. ఇంకెంతకాలం సాగుతాయో ఇలా ఆడవాళ్లను అడ్డుగా పెట్టుకొని చేస్తున్న ఆగడాలు.