కొత్త టాలెంట్‌తో షాక్‌ ఇచ్చిన అవసరాల..!

JSR
నాని హీరోగా తెరకెక్కిన అష్టా చమ్మా సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన కామెడీ నటుడు అవసరాల శ్రీనివాస్. కమెడియన్‌ గా మంచి ఫాంలో ఉండగానే మెగా ఫోన్‌ పట్టుకున్న ఈ యంగ్ కమెడియన్‌ దర్శకుడిగానూ సక్సెస్‌ సాధించాడు. గోల్కొండ హైస్కూల్ సినిమాకు మాటలు అందించిన అవసరాల తరువాత ఊహలు గుసగుసలాడే సినిమాతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమా ఘనవిజయం సాధించటంతో దర్శకుడిగానూ కొనసాగుతున్నాడు అవసరాల.

అంతేకాదు నటుడిగానూ వర్సటైల్‌ అనిపించుకుంటున్నాడు అవసరాల శ్రీనివాస్. కేవలం కమెడియన్‌ గానే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ గా, విలన్‌ గా కూడా ఆకట్టుకున్నాడు. దీంతో నటుడిగానూ ఫుల్ బిజీగా ఉన్నాడు అవసరాల శ్రీనివాస్. తాజాగా ఈ నటుడు మరో ఇంట్రస్టింగ్ వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశాడు. ఓ పాత పాటను అవసరాల అద్భుతంగా ఆలపిస్తున్న వీడియోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేశాడు.

అయితే ఈ వీడియోను చూసిన నెటిజెన్లు షాక్ అవుతున్నారు. అవసరాల లో ఇంత మంచి గాయకుడు కూడా ఉన్నాడా..? అనుకున్నారు. అయితే ఆ వీడియోలోనే అసలు సీక్రెట్‌ బయట పెట్టాడు అవసరాల శ్రీనివాస్. తాను మైక్‌ పట్టుకొని పాట పాడుతున్నట్టుగా నటిస్తుండగ.. పక్కన మరో వ్యక్తి కూర్చోని పాట పాడాడు. కమెడియన్‌ అవసరాల శ్రీనివాస్ పోస్ట్ చేసి ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Playback singing :):)

A post shared by avasarala srinivas (@srinivasarala) on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: