కరోనా బూచీ.. వాళ్లకు దూరంగా ఉండండి : స్టార్‌ హీరోయిన్‌ సలహా

JSR
కరోనాపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు సెలబ్రిటీలు ముందుకు వస్తున్నారు. వీడియో మెసేజ్‌ లు రిలీజ్ చేయటంతో పాటు తమ వంతుగా సోషల్ మీడియా వేదికగా అభిమానులకు సలహాలు సూచనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ నటి సోనమ్ కపూర్‌ కూడా తన ఫాలోవర్స్‌కు ఓ సలహా ఇచ్చింది. ఇప్పటికే మన దేశంలో 180కి మందికిపై గా వైరస్‌ సోకినట్టుగా తెలుస్తోంది. 5 కు  వైరస్ ప్రభావంతో ప్రాణాలు విడిచారు. అయితే ఎక్కువగా వయసైన వారు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మాత్రమే ఈ వైరస్‌ కారణంగా మరణిస్తున్నారని డాక్టర్లు వెల్లడించారు.

ఈ సందర్భంగా సోనమ్ కపూర్ స్పందిస్తూ..  `నా అభిమానులంతా కరోనా వైరస్‌ బారిన పడకుండా ఇళ్లలోనే సేఫ్‌గా ఉండండి. అంతేకాదు వ్యక్తిగత పరిశుభ్రత కు ఎంతో ప్రముఖ్యతని ఇవ్వండి. తరుచూ మీ చేతులను శుభ్రపరుచుకోండి. ముఖ్యంగా మీ ఇంట్లో అమ్మమ్మలు తాతయ్యలు ఉంటే వారికి దూరంగా ఉండండి. ఈ వైరస్‌ కారణంగా వృద్ధులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్నారు` అంటూ తన వంతుగా అభిమానులకు సూచనలు చేసింది.

అంతేకాదు హెల్పింగ్‌ హ్యాండ్స్‌ అనే సంస్థతో కలిసి పేద, అనాథ పిల్లలకు మాస్క్‌లు, ఇతర సానిటేషన్‌ లిక్విడ్స్‌ ను అందజేసేందుకు తన వంతు సాయం చేస్తోంది. ఈ సేవా కార్యక్రమాల్లో భాగం పంచుకోవాలనుకున్నారు హెల్పింగ్ హ్యాండ్స్‌ వెబ్‌ సైట్ ద్వారా సాయం చేయాలని కోరింది సోనమ్.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Helping Hands Foundation is raising funds to provide protective masks and essentials to the children undergoing treatment and their families. The masks are for the healthcare heroes, social {{RelevantDataTitle}}