'జనతా కర్ఫ్యూ' పాటించడం ప్రతి పౌరుడు బాధ్యతగా స్వీకరించాలి : చిరంజీవి

Edari Rama Krishna

ఇప్పుడు ప్రపంచం మొత్తం కరోనా గుప్పిట్లో ఉందనే అంటున్నారు.  ఎక్కడ చూసినా ఈ కరోనా గురించిన చర్చలే నడుస్తున్నాయి.  కరోనా మహమ్మారి చేస్తున్న కరాళ నృత్యానికి జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు.  ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు వేలకు చేరుకుంది.. ఇంకా లక్షకు పైగా ఈ కరోనా బారిన పడ్డారు ఉన్నారు.  చైనాలోని పుహాన్ లో పుట్టుకొచ్చిన ఈ వైరన్ అక్కడ ప్రభావం తక్కువ చూపిస్తున్నా.. ప్రపంచ దేశాల్లో మాత్రం వణుకు పుట్టిస్తుంది. న ఇటలీలో కరోనా వైరస్ మరణ మృదంగం మోగిస్తోంది. నిన్న ఒక్క రోజే ఆ దేశంలో కరోనా మహమ్మారి కారణంగా ఏకంగా 627 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో, ఆ దేశంలో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 4,032కి చేరుకుంది.

 

ఆ తర్వాత ఫ్రాన్స్ లో ఈ కరోనా ప్రభావం ఎక్కువగా చూపిస్తుంది.  అమెరికా వంటి అగ్ర రాజ్యం కూడా ఇప్పుడు కరోనా పేరు వింటేనే భయంతో వణికిపోతుంది.  దారుణమైన విషయం ఏంటంటే కరోనా కు ఇప్పటి  వరకు మెడిసన్ కనుగొనలేకపోవడం. భారత దేశంలో కరోనాను అరికట్టేందుకు రేపు 'జనతా కర్ఫ్యూ' నిర్వహించాలని ప్రభాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సూచించారు.  ఈ నేపథ్యంలో పలువురు సెలబ్రెటీలు మోదీ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. రేపు 'జనతా కర్ఫ్యూ'ను ప్రజలందరూ పాటించాలని మెగాస్టార్ చిరంజీవి ఓ వీడియో విడుదల చేశారు.

 

క‌రోనా వ్యాప్తిని అరికట్టడానికి 24 గంట‌లు ప‌నిచేస్తున్న వైద్యులు, న‌ర్సులు, ఇత‌ర బృందాలకు, పారిశుద్ధ్య కార్మికుల‌కు, పోలీసు శాఖ‌కి, ఆయా ప్ర‌భుత్వ అధికారుల‌ను ప్ర‌శంసించాల్సిన స‌మ‌య‌మిదని ఆయన చెప్పారు. ఇళ్ల‌కే ప‌రిమిత‌మ‌వుదామని, రేపు సాయంత్రం 5 గంట‌ల‌కు ప్ర‌తి ఒక్క‌రూ మ‌న గుమ్మాల్లోకి వ‌చ్చి సేవలందిస్తోన్న వారికి చెప్పట్లతో ధ‌న్య‌వాదాలు తెల‌పాల్సిన స‌మ‌య‌మిదని ఆయన వాఖ్యానించారు.  కరోనాను అరికట్టడం మన చేతిలో పని అంటున్నారు మెగాస్టార్ చిరంజీవి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: