బోయపాటి సినిమాలో బాలయ్య లుక్ చంపేశాడుగా...!
ఇటీవల ఓ కార్యక్రమంలో బయటకు వచ్చిన బాలయ్య డిఫరెంట్ లుక్లో దర్శనమిచ్చారు. చిన్నపాటి జుట్టు, గుబురు మీసంతో కనిపించిన బాలయ్య లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో బోయపాటి సినిమాలో బాలయ్య లుక్ ఇదే నంటూ జోరుగా చర్చలు కూడా నడుస్తున్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటనా ఇప్పటి వరకు లేదు. అంజలి హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
ఈ సినిమాలో బాలయ్య భాష, వేషం, ఆహార్యం పూర్తిగా మార్చేసుకున్నారట. మాస్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలయ్య అఘోరాగా నటిస్తున్నాడని అంటున్నారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్ సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో ఇప్పుడు ఈ సినిమా కూడా హ్యాట్రిక్ కొడుతుందని అంటున్నారు. మరి బాలయ్య - బోయాపాటి ఇద్దరు ప్లాపుల్లో ఉన్నారు. వీరు ఈ సినిమాతో అయినా ఫామ్లోకి వస్తారేమో ? చూడాలి. ఇక ఈ సినిమాలో రెండో హీరోయిన్గా ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై పెద్ద కసరత్తులే నడుస్తున్నాయట. మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమా నిర్మిస్తున్నాడు.