జనతా కర్ఫ్యూ: R R R టీం ధైర్యాన్ని మెచ్చుకోవాలి ... కరోనాపై ఇలా ఫైట్ చేయాలి..
ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌కు బ్రేకులు పడడంతో ఈ గ్యాప్‌లో రాజమౌళి తనకు ఇష్టమైన స్పోర్ట్స్ పై కాన్‌సంట్రేషన్ చేశారు. రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నమెంట్ బహుమతుల కార్యక్రమంలో పాల్గొన్న రాజమౌళి- ఎన్టీఆర్- రామ్ చరణ్.. ఈ టోర్నమెంట్ విన్నర్ అయిన నల్లగొండ జట్టుకు ట్రోఫీ అందజేశారు. ఇప్పుడు వీరు బహుమతులు అందజేస్తోన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్రమంలోనే ఇంత జరుగుతోన్నా ఈ టీం కరోనా వైరస్ అన్న భయం లేకుండా ప్రతి ఒక్కరిలో స్ఫూర్తి నింపేందుకు చేసిన ప్రయత్నాన్ని మెచ్చుకుంటున్నారు.
ఈ ఫొటోపై ప్రతి ఒక్కరు ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలు కరోనా పుట్టిన పుహాన్ నగరంలో అక్కడ ప్రభుత్వం కరోనాని పూర్తిగా ఎలా తరిమేసిందో ? అక్కడ ప్రజల్లో ఎలా ధైర్యాన్ని నింపిందో ? ఇక్కడ కూడా ఇప్పుడు ఈ ఆర్.ఆర్.ఆర్ సినిమా టీం కూడా తమ వంతుగా కరోనా రక్కసి గురించి ఎలాంటి అపోహలు వద్దని.. భయపడాల్సిన అవసరం లేదని ప్రజల్లో ధైర్యం నింపే సాహసం చేస్తోంది. ఇక ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ఈ నెల 31 వరకు బంద్. ఏప్రిల్ 1 నుంచి తిరిగి ప్రారంభించాల్సి ఉంటుంది.