కరోనా ప్రభావంతో ప్రజలంతా భయకంపితులవుతుంటే బాలీవుడ్ భామలు మాత్రం హాట్ హాట్ ఫోటోలు వీడియోలతో అభిమానులను ఎంటర్టైన్ చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ నేహా శర్మ ఓ హాట్ ఫోటోను తన సోషల్ మీడియా పేజ్‌లో పోస్ట్ చేసింది. భయం గుప్పిట్లో బిక్కు బిక్కుమంటున్న ప్రజలకు కాస్త ఊరటనిచ్చేందుకే ఈ ఫోటోను పోస్ట్ చేసిందట నేహా. వైట్ కలర్ స్ట్రిప్ ఇన్నర్ వేర్ వేసుకోని పైన వైట్ రోబ్ కప్పుకొని ఉన్న నేహా ఫోటో ఇంటర్ నెట్ ను షేక్ చేస్తోంది.
ఈ ఫోటోతో పాటు `బయట ఉన్న పరిస్థితుల నుంచి ఊరటనిచ్చే చిన్న డిస్ట్రాక్షన్. ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి` అనే కామెంట్ ను యాడ్ చేసింది. నేహా పోస్ట్ పై ఫాలోవర్స్ కూడా అదే రేంజ్ లో రియాక్ట్ అవుతున్నారు. ఓ నెటిజెస్ `ఈవె కరోనా కన్నా ఖతర్నాక్.. జనాలను కాస్త చల్లబడనివ్వు నేహా. మరీ అంతా సెగలురేపకు` అంటూ రిప్లై ఇచ్చాడు. మరో వ్యక్తి `ఆమే ఒప్పుకుంది హాట్ ఫోటోలు ఫాలోవర్స్‌కు వల వేసేందుకే పెడుతుంది` అంటూ కామెంట్ చేశాడు. మరో వ్యక్తి `మన కోసం నేహ ఎంత కేర్ తీసుకుంటుందో చూడండి` అంటూ ఆమె పోస్ట్ ను వెటకారం చేశాడు.
రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన చిరుత సినిమాతో వెండితెరకు పరిచయం అయిన నేహా శర్మ తరువాత బాలీవుడ్ లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. అయితే ఎక్కడ సక్సెస్ దక్కకపోవటంతో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఎక్కువగా సోషల్ మీడియాకే పరిమతమైన నేహా శర్మ అడపాదడపా బాలీవుడ్ సినిమాల్లో నటిస్తోంది.
మరింత సమాచారం తెలుసుకోండి: