తమన్నాని హాట్ గా చూపించి నన్ను అంటీని చేస్తారా..?

shami

ఆరెక్స్ 100 సినిమాతో తెలుగు యూత్ ఆడియెన్స్ కు పిచ్చెక్కేలా చేసిన భామ పాయల్ రాజ్ ఫుత్. బాలీవుడ్ లో సీరియల్స్ చేస్తూ ఉండే ఈ అమ్మడిని తీసుకొచ్చి ఒక క్రేజీ సినిమా చేశాడు డైరక్టర్ అజయ్ భూపతి. మొదటి సినిమాతోనే సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత అలాంటి చాన్సులే అందుకుంది. ఆరెక్స్ 100 తర్వాత ఆర్డీఎక్స్ లవ్ ఇంకా సీత సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ ఇలా సినిమాలు చేస్తూ వచ్చింది అయితే సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ పక్కన నటించే లక్కీ ఛాన్స్ అందుకుంది పాయల్ రాజ్ పుత్. వెంకీమామ సినిమాలో పాయల్ తన అందంతో మెప్పించింది. 

 

అయితే వెంకటేష్ సీనియర్ హీరోనే అయినా అతని పక్కన నటిస్తే యువ హీరోల ఛాన్సులు వస్తాయా అని అప్పుడు ఆలోచించలేదు పాయల్. ఎందుకంటే అంతకుముందే ఎఫ్-2 సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా వెంకటేష్ తో జత కట్టింది. ఆ సినిమాలో తమన్నాయని  చూపించారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని పాయల్ ఈ సినిమాకు ఒకే చెప్పిందట. అయితే సినిమా చేశాక కానీ సీన్ రివర్స్ అయ్యిందని తెలిసింది. తమన్నాని గ్లామర్ గా చూపించగా వెంకీమామలో పాయల్ ను మాత్రం ఆంటీలా చూపించారు. అంటే వెంకటేష్ వేసింది కూడా మామ పాత్ర కాబట్టి ఆయనకు జోడీ అంటే కుర్ర హీరోయిన్ గా కాకుండా కాస్త ముదురు భామగా చూపించారు. 

 

అయితే వెంకీమామ రిజల్ట్ తో సంతోషించిన సినిమాలో ఆమె లుక్ ను చూసి తన సన్నిహితులు మాత్రం తిట్టారట. అందుకే ఇక మీదట అలాట్ పాత్రలు చేయకూడదని నిర్ణయించుకుంది పాయల్ రాజ్ పుత్. వెంకీమామ హిట్ అయినా ఆ తర్వాత రవితేజ తో చేసిన డిస్కో రాజా ఫ్లాప్ గా నిలిచింది. మరో ఆరెక్స్ 100 లాంటి సినిమా పడితేనే కానీ అమ్మడు మళ్లీ ఫామ్ లోకి వచ్చేలా లేదు. అవకాశాలైతే వస్తున్నా అందరు తనని హాట్ గా చూపించాలనే ఉద్దేశంతో కథలు తెలుస్తున్నారు తప్ప తనలోని టాలెంట్ ను ఎవరు గుర్తిచట్లేదు అని బాధపడుతుంది పాయల్.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: