కరోనా: వైద్య సిబ్బందికి హీరో నిఖిల్ వినూత్న సాయం

Murali

యావత్ ప్రపంచంతో పాటు భారత్ ను కుదిపేస్తున్న కరోనా వైరస్ రోజు రోజుకీ తన ప్రతాపం చూపిస్తూ కలవరపెడుతోంది. ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలకు తోడు ప్రజలంతా స్వచ్ఛందంగా జాగ్రత్తలు పాటిస్తున్నారు. ఈ మహమ్మారిని ఎదుర్కొనేందుకు మేమంతా ఉన్నామంటూ దిగ్గజ సంస్థలు, సెలబ్రిటీలు, సినీ వర్గాలు తమ వంతు విరాళాలు ప్రభుత్వాలకు ఇస్తున్నారు. మరి కొందరు తమకు తోచిన రీతిలో సాయం చేస్తున్నారు. ఇందుకు మన టాలీవుడ్ యువ హీరో నిఖిల్ సిద్ధార్ద్ కూడా ముందుకొచ్చి సాయం చేస్తున్నాడు.

 

 

కరోనా బాధితుల కోసం రేయింబవళ్లు పని చేస్తున్న డాక్టర్లు, నర్సుల కోసం మాస్కులు, కళ్లజోళ్లు పంపిణీ చేసి తన స్టైల్లో ఉదారత చాటుకున్నాడు. ‘ప్రజారోగ్యం కోసం కష్టపడుతున్న డాక్టర్లు వైద్య సిబ్బందికి నావంతు సాయం అందిస్తున్నాను. 2000 ఎన్95/Fp రెస్పిరేటర్లు,  2000 రీయూజబుల్ గ్లోవ్స్, 2000 ఐ ప్రొటెక్షన్ గ్లాసెస్, శానిటైజర్స, 10వేల ఫేస్ మాస్కులను రెండు తెలుగు రాష్ట్రాల్లోని డాక్టర్లకు, వైద్య సిబ్బందికి వీటిని అందజేస్తున్నాను. తొలి విడతగా హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్ లో ఈ మేరకు వీటిని నేనే స్వయంగా అందజేస్తున్నాను’ అని తెలిపాడు. ఈ మేరకు తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్ స్టాగ్రామ్ లో ఓ ఫొటోను, వీడియోను షేర్ చేశాడు.

 

 

దీనిపై గాంధీ హాస్పిట్ చీఫ్ సూపరిటిండెంట్ శ్రవణ్ మాట్లాడుతూ.. ‘కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు మేము చేస్తున్న ప్రయత్నానికి హీరో నిఖిల్ ఈ సాయం అందించడం శుభపరిణామం. ఇందుకు హీరో నిఖిల్ ను గాంధీ హాస్పిటల్ తరపున అభినందిస్తున్నాను’ అన్నారు. హీరో నిఖిల్ మాట్లాడుతూ.. ‘డాక్టర్లందరూ చేస్తున్న సేవ గొప్పది. వాళ్లు లేకపోతే మనము లేము. అందుకే వారికి అవసరమైన సామాగ్రిని నా శక్తిమేర అందిస్తున్నాను’ అని నిఖిల్ తెలిపాడు. నిఖిల్ దాతృత్వానికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
I’m doing my bit by Contributing ‬to the {{RelevantDataTitle}}