అందరి ముందు అలా చేయాలంటే చాలా సిగ్గేస్తుంది..!
హీరో హీరోయిన్ రొమాన్స్ తెర మీద చూసి మనం ఎంజాయ్ చేస్తాం.. అక్కడ కనిపించడానికి వాళ్లిద్దరే ఉన్నట్టు అనిపించినా చుట్టూ సినిమా యూనిట్ ఉంటుంది. హీరో హీరోయిన్ లిప్ లాక్ లేదా ఇంటిమేట్ సీన్ ఏదైనా కేవలం వాళ్లిద్దరు మాత్రమే ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ చుటూ కెమెరా మెన్, అసిస్టెంట్స్, చిత్రయూనిట్ మొత్తం దాదాపు 50 మంది దాకా ఉంటారు. అంతమందిలో హీరో హీరోయిన్ రొమాన్స్ పండించాల్సి ఉంటుంది. అయితే కొందరు సీన్ చేసేప్పుడు పక్కన ఎవరున్నారు అన్నది పట్టించుకోరు.. కానీ స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే మాత్రం అలాంటి సీన్స్ చేయడంలో తన ఇబ్బంది చెప్పుకొచ్చింది.
హీరో హీరోయిన్ ఒళ్ళు మర్చిపోయి రొమాన్స్ చేయాలి. ముద్దుల్లో మునిగితేలాలి.. పక్కన ఎవరున్నారు అన్నది అసలు పట్టించుకోకూడదు. అందరి సమక్షంలో ఆ సీన్స్ చేయాలంటే మాత్రం సిగ్గేస్తుంది అంటుంది పూజా హెగ్డే. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస స్టార్ ఛాన్సులు పెట్టేస్తూ అదరగొడుతున్న పూజా హెగ్డే మరో రెండు మూడేళ్లు తన హవా కొనసాగించేలా ఉంది. డిజెలో బికినీ లుక్స్ తో కుర్రాళ్లను తన వైపుకు తిప్పుకున్న ఈ అమ్మడు తాను చేస్తున్న ప్రతి సినిమాలో అవసరానికి మించి హాట్ గా కనిపించడానికి ప్రయత్నిస్తుంది. అందరి హీరోయిన్స్ కు పూజా కు అదే తేడా.
అందుకే ఈ అమ్మడు వరుస స్టార్ సినిమా అవకాశాలు అందుకుంటుంది. ఈ ఇయర్ అల వైకుంఠపురములో హిట్ అందుకున్న పూజా హెగ్డే ప్రభాస్ తో ఒక సినిమా.. అఖిల్ తో ఒక సినిమా చేస్తుంది. అఖిల్ సినిమా త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తారని తెలుస్తుంది. ప్రభాస్ సినిమా మాత్త్రం దసరాకి రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా తెలుగులో మాత్రం పూజా ఫామ్ మాములుగా లేదు. అందుకే రెమ్యునరేషన్ కూడా భారీగా పెంచిందని అంటున్నారు.