బెస్ట్ ఫ్రెండ్ అనడం కాదు కీర్తి..... పుట్టినరోజు ఎప్ప్పుడో కూడా గుర్తుపెట్టుకోవాలి.... !!
టాలీవుడ్ యువ నటుడు నితిన్, తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాతో హీరోగా పరిచయం అయిన విషయం తెలిసిందే. ఫస్ట్ సినిమాలో ఆకట్టుకునే పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులను ఆలరించిన నితిన్, ఆ తరువాత మెల్లగా ఒక్కొక్కటిగా వస్తున్న అవకాశాలు అందిపుచ్చుకుని ఆపై టాలీవుడ్ లో మంచి పేరు దక్కించుకున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పెద్ద ఫ్యాన్ అయిన నితిన్, తన సినిమాల్లో అక్కడక్కడ పవన్ సినిమాల్లోని కొన్ని సీన్స్ ని రిఫరెన్స్ గా తీసుకోవడం తనకు ఎంతో ఇష్టం అని చెప్తారు.
Wishing you a Happy quarantine birthday Arjun!😈 @actor_nithiin
Love,
Anu 👼#RangDe #RangDeFirstLook
▶️ https://t.co/K9qXQ96xtP#HappyBirthdayNithiin @pcsreeram @ThisIsDSP @dirvenky_atluri @SitharaEnts @vamsi84 https://t.co/c0mZiP3QmN — Keerthy suresh (@KeerthyOfficial) March 29, 2020
వాస్తవానికి గత కొద్దికాలంగా సరైన హిట్ లేని నితిన్, ఇటీవల యువ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో వచ్చిన భీష్మ తో సూపర్ హిట్ కొట్టి, ప్రస్తుతం తొలిప్రేమ, మిస్టర్ మజ్ను సినిమాల దర్శకుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. మహానటి ఫేమ్ కీర్తి సురేష్ తొలిసారిగా నితిన్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని కాసేపటి క్రితం సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. నేడు నితిన్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈ పోస్టర్ ని రిలీజ్ చేశారు. మంచి రొమాంటిక్ లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో అర్జున్, అను గా నితిన్, కీర్తి నటిస్తున్నారు.
Bday tom anuuu..Best friend antaavu malli..tom wish cheyyi malli..byee https://t.co/JwjLKOjeDx — nithiin (@actor_nithiin) March 29, 2020
కాగా ఈ మోషన్ పోస్టర్ ని మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి, హ్యాపీ బర్త్ డే అర్జున్ అంటూ హీరోయిన్ కీర్తి సురేష్ తన సోషల్ మీడియా మాధ్యమాల్లో నిన్న ఒక పోస్ట్ చేసింది. అబ్బా కీర్తి, బెస్ట్ ఫ్రెండ్ ఆని అంటావు, నిజానికి నా బర్త్ డే రేపు, కాబట్టి రేపు కూడా విష్ చేయు అంటూ సరదాగా ఆమె ట్వీట్ ని రీట్వీట్ చేసారు నితిన్. ఇక ప్రస్తుతం వారిద్దరి సరదా ట్వీట్స్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతున్నాయి. అయితే అందుతున్న సమాచారాన్ని బట్టి జూన్ లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు చెప్తున్నారు....!!