హెరాల్డ్ స్పెషల్ MAR 2020: కరోనా ఎఫెక్ట్.. సినీ కార్మికుల గురించి మొదట ఆలోచించింది వారే..!

Suma Kallamadi

కరోనా వైరస్ కారణంగా టాలీవుడ్ వెండితెర పరిశ్రమలో రోజువారి వేతనం పుచ్చుకునే సినీ కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. అసలే హైదరాబాద్... అందులోనూ జేబులో డబ్బులు లేకపోతే పస్తులు ఉండాల్సిందే. అయితే ఈ విషయాన్ని తెలుసుకున్న బడా సినీ హీరోలు ఒక కరోనా క్రైసిస్ చారిటీ ని ఏర్పాటు చేసి తమవంతు సాయంగా సినీ కార్మికుల కోసం విరాళాలను అందజేస్తున్నారు. 

 

ఈ చారిటీ సంస్థకు మెగాస్టార్ చిరంజీవి నాయకత్వం వహిస్తున్నారు. చిరంజీవి తాజాగా ఓ సోషల్ మీడియా ఖాతాని తెరచి కరోనా సంక్షోభ సమయంలో కార్మికులకు సహాయార్థం ఎవరెవరు ఎన్ని డబ్బులు ఇచ్చారో తెలియజేస్తూ వారిని అభినందించారు. ఇప్పటివరకైతే... టాలీవుడ్ ప్రముఖులంతా కలసి సుమారు నాలుగు కోట్ల రూపాయలను సినీ కార్మికుల బాగోగుల కోసం ఈ చారిటీ సంస్థకు విరాళంగా అందజేశారు. అక్కినేని నాగార్జున కోటి రూపాయలను ఛారిటీ సంస్థకి ప్రకటిస్తే తారక్ రూ. 25లక్షలను దానం చేశాడు.


మరోవైపు సినీ పరిశ్రమ లో భాగమైన మంచు విష్ణు, జీవితా రాజశేఖర్ కరోనా వైరస్ దెబ్బకి తిండి లేక అవస్థలు పడుతున్న అనేకమందికి ఆహార పొట్లాలు, వాటర్ బాటిల్స్ లని అందజేస్తున్నారు. అలాగే సినీీీ కార్మికుల గురించి మొట్టమొదటిగా ఆలోచించిన జీవితా, రాజశేఖర్... రాజశేఖర్ చారిటబుల్ సంస్థ ద్వారా నిరుపేద కళాకారులకు పది రోజులకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు.

 


అయితే మరి ఇలాంటి వారిని టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద స్టార్ గా పిలవబడే హీరో పట్టించుకోకపోవడం అందర్నీ విస్తుపోయేలా చేస్తుంది. కరోనా క్రైసిస్ చారిటీ లో వీరికి ఎటువంటి ప్లేస్ ఇవ్వకపోవడం ప్రస్తుతం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఇంకొక సీనియర్ మాస్ హీరో ని కూడా గుర్తించకుండా అతని పేరు అసలు ఎత్తకపోవడం అభిమానుల ఆగ్రహానికి కారణమవుతుంది. ఈ వివక్షత వెనుక దాగున్న కారణాలేంటో సమీప భవిష్యత్తులో తెలియాల్సి ఉంది. ఇప్పటికే జీవిత రాజశేఖర్ పై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అందుకే వారిని CCC నుండి పక్కన పెట్టారని గుసగుసలు వినపడుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: