ఉప్పెన నుండి విజయ్ లుక్ విడుదల..
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమవుతున్న చిత్రం ఉప్పెన. కరోనా లేకుంటే మరో రెండు రోజుల్లో ఈచిత్రం ప్రేక్షకులముందుకు వచ్చేదే.. అయితే కరోనా వల్ల లాక్ డౌన్ కొనసాగుతున్ననేపథ్యంలో విడుదలను వాయిదావేశారు. మేలో ఈ సినిమా రిలీజ్ కానుందని సమాచారం. ఇక ఈ చిత్రం నుండి తాజాగా ప్రముఖ తమిళ నటుడు ,మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి లేటెస్ట్ లుక్ విడుదలైంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టోరీ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్ పాత్రలో కనిపించనున్నాడు. కాగా తెలుగులో అతనికి ఇది రెండో సినిమా..
1.ఒరేయ్ మీకు దణ్ణం... ఇళ్ళల్లోనే ఉండండ్రా...బయటకి రాకండి🙏🏼🙏🏼🙏🏼#Uppena https://t.co/PZpMHtVg8s pic.twitter.com/EyOTGA1K22 — FanaticsOf❤Rockstar🎶DSP🎶 (@DSP_Cults) March 31, 2020