సూపర్ స్టార్ కృష్ణ నట ప్రస్థానానికి 55 ఏళ్లు

Murali

తెలుగు సినిమాల్లో అద్భుతమైన స్టార్ డమ్ సంపాదించిన హీరోల్లో ఘట్టమనేని కృష్ణ కూడా ఉన్నారు. 300 పైచిలుకు సినిమాల్లో హీరోగా నటించిన ఘనత కృష్ణ సొంతం. ప్రపంచంలో ఇంతటి రికార్డు మరే హీరోకు లేదు.. ఇక రాబోదు కూడా. ఆయన నటించిన తొలి చిత్రం తేనెమనసులు సినిమా విడుదలై నేటితో 55ఏళ్లు పూర్తి కావడంతో పాటు ఆయన సినీ నట ప్రయాణానికి కూడా 55 ఏళ్లు పూర్తయ్యాయి. తెలుగు సినిమాను కొత్త దశలు దాటించారు.

 

డేరింగ్ అండ్ డాషింగ్ హీరో, జేమ్స్ బాండ్ హీరో, సూపర్ స్టార్ ఆయనకు దక్కిన బిరుదులు. తొలి సినిమా 1965లో.. 100వ సినిమా అల్లూరి సీతారామరాజు 1974లో.. 200వ సినిమా ఈనాడు 1982లో.. 300వ సినిమా తెలుగువీర లేవరా 1996లో వచ్చాయి. ఇదంతా సూపర్ స్టార్ కృష్ణ మాత్రమే క్రియేట్ చేసిన రికార్డ్. ఓ దశలో ఏలూరులో 19 సినిమా ధియేటర్లు ఉంటే అన్ని ధియేటర్లలోనూ కృష్ణ సినిమాలే రన్ అయ్యాయి. అంతవేగంగా.. ఒకే సమయంలో అన్ని సినిమాలు చేసేవారు కృష్ణ. తెలుగు సినిమాలకు కౌబాయ్, జేమ్స్ బాండ్, థ్రిల్లర్ మూవీస్ ని పరిచయం చేశారు.

 

తెలుగులో ఫస్ట్ స్కోప్ మూవీ, సింహాసనంతో తొలి 70mm స్టీరియో ఫోనిక్ సౌండ్ సిస్టమ్ ని పరిచయం చేశారు. పద్మాలయా స్టూడియో అధినేతగా, ఆ బ్యానర్ పై కూడా ఎన్నో సినిమాలు తీశారు.  ఆ సమయంలో తెలుగులో అత్యధిక రిజిస్టర్డ్ ఫ్యాన్ అసోసియేషన్లు ఉన్న ఏకైక హీరోగా కృష్ణ నిలిచారు. సూపర్ స్టార్ బిరుదు కోసం శివరంజని పత్రిక పెట్టిన పోల్ లో మరే హీరో కూడా దరిదాపుల్లోకి రానన్ని ఓట్టు సంపాదించి ఆ బిరుదును సొంతం చేసుకున్నారు. ఈ మేరకు ఆయన తనయుడు మహేశ్ తన ఇన్ స్టాలో తండ్రికి శుభాకాంక్షలు తెలిపారు.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
My all time favourite❤️ #timelessclassic #TeneManasulu #Repost • @mbofficialteam Our Evergreen SuperStar

A post shared by
{{RelevantDataTitle}}