లవర్ తో మాజీ మిస్ యూనివర్స్ ఘాటు రొమాన్స్

Murali

కరోనా ప్రళయం సృష్టిస్తున్న వేళ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ టైమ్ లో తాము చేయాలనుకున్న పనులను చేస్తున్నారు. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడటం, ఇంట్లో పెండింగ్ పనులు.. ఇలా ఎవరికి తోచింది వారు చేస్తున్నారు. ఇందులో సినీ సెలబ్రిటీలు కూడా మినహాయింపు కాదు. హీరోలు కథలు వినడం, దర్శకలు కథలు రాసుకోవడం, డెవలప్ చేసుకోవడం చేస్తున్నారు. హీరోయిన్లు గ్లామర్ పెంచుకోవడం కోసం వర్కౌట్లు చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం చేస్తున్నారు. మాజీ మిస్ యూనివర్స్ సుస్మితా సేన్ కూడా ఇదే ఫాలో అవుతోంది.

 

 

ఇంట్లో ఉన్న ఈ ఖాళీ సమయంలో యోగా చూస్తూ బాడీ ఫిట్ నెస్ పై ఈ షకలక బేబీ దృష్టి పెట్టింది. తన డేటింగ్ పార్టనర్ రోహ్మన్ శ్వాల్ తో కలిసి యోగా చేస్తోంది. వీరిద్దరూ కలిసి చేస్తున్న యోగా స్టిల్స్ ను సుస్మిత తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. సాధారణంగా హీరోయిన్లు తాము సోలోగానే ఇలా యోగా, ఎక్సర్ సైజులు, డ్యాన్స్.. చేస్తూ ఆ ఫొటోలను పోస్ట్ చేస్తారు. కానీ సుస్మిత తన ప్రియుడితో కలిసి యోగా చేయడం నెట్టింట్లో వైరల్ గా మారింది.

 

 

పేరుకి ఇవి యోగా చేస్తున్న స్టిల్స్ అయినా కానీ చూసేందుకు మాత్రం ఇవి రొమాంటిక్ గా ఉన్నాయి. వయసు నలభైల్లో ఉన్నా స్లిమ్ బాడీ ఫిట్ మెయిన్ టైన్ చేస్తోంది. ‘కష్ట సమయాలు ప్రతిసారీ రావు. వచ్చిన సమయాల్లోనే మనం ధైర్యంగా ఉండాలి. మనలోని బలాన్ని తెలిపేది అదే’ అంటూ తన వాల్ లో రాసుకుంది. ‘యోగా చేస్తున్నారా.. రొమాన్స్ చేస్తున్నారా’, ‘మేడ్ ఫర్ ఈచ్ అదర్ లా ఉన్నారు’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Tough times don’t last...Tough {{RelevantDataTitle}}