రామ్ చరణ్ మళ్ళీ ప్రయోగమే...!

Gullapally Rajesh

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అయినా సరే... రామ్ చరణ్ మాత్రం ప్రయోగాలకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తూ ఉంటాడు. వరుసగా సినిమాలు చేస్తున్నా సరే ఆయన మాత్రం చాలా జాగ్రత్తగా కథలను ఎంపిక చేసుకుంటూ ఇతర హీరోలకు ఆదర్శంగా నిలుస్తూ ఉంటాడు. కెరీర్ ఆరంభంలో మగధీర చేసినా ఆ తర్వాత ఎవడూ చేసినా, కెరీర్ పీక్ స్టేజి లో ఉన్నప్పుడు రంగస్థలం తో సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేసినా అది రామ్ చరణ్ కే చెల్లింది. 

 

అతను కథల ఎంపికలో చాలా వరకు జాగ్రత్తలు తీసుకుని సినిమాలు చేస్తున్నాడు అనేది అర్ధమవుతుంది. ఇప్పుడు మళ్ళీ కొత్త కథలను ఎంపిక చేస్తున్నాడు. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న రామ్ చరణ్ వచ్చే కథను కూడా గ్రామాల్లో ఉండే ఫ్యాక్షన్ ఆధారంగా చెయ్యాలని భావిస్తున్నట్టు సమాచారం. తాను ఒక ఇంట్లో పాలేరు గా ఉంటూ రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ కథను చేయడానికి సిద్దమైనట్టు సమాచారం. 

 

ఈ సినిమా కథను ఇప్పటికె రామ్ చరణ్ వినట్టు కూడా తెలుస్తుంది. ఇక తన తండ్రి కూడా ఈ కథకు ఓకే చెప్పినట్టు సమాచారం. ఈ కథ గురించి త్వరలోనే తుది మార్పులు చెప్పి సినిమా చెయ్యాలని భావిస్తున్నాడు ఈ మెగా హీరో. ఈ సినిమా కథ చిరంజీవి కి బాగా నచ్చింది అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. అన్నీ అనుకున్నట్టు జరిగితే రామ్ చరణ్ చేసే తర్వాతి సినిమా ఇదే అని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మరి ఇది ఎంత వరకు నిజమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: