పాపులర్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు హీరోగా పరిచయం అవుతున్న '30 రోజుల్లో ప్రేమించటం ఎలా' చిత్రంలోని 'నీలి నీలి ఆకాశం' పాట యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది. సంగీత ప్రియుల ఆదరణతో 100 మిలియన్ వ్యూస్ క్రాస్ చేసి, ఈ స్థాయి సినిమాల్లో ఇటీవలి కాలంలో ఈ ఫీట్ సాధించిన సినిమాగా సరికొత్త చరిత్రను సాధించింది. సుకుమార్ దగ్గర 'ఆర్య 2', '1.. నేనొక్కడినే' చిత్రాలకు పనిచేసిన మున్నా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్వీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై కన్నడ చిత్రసీమలో విజయవంతమైన చిత్రాల నిర్మాతగా పేరుపొందిన ఎస్వీ బాబు నిర్మిస్తున్నారు.
అనూప్ రూబెన్స్ సంగీతం సమకూర్చగా, 'నీలి నీలి ఆకాశం' పాటతో సహా చిత్రంలోని అన్ని పాటలనూ చంద్రబోస్ రాశారు. ప్రదీప్ మాచిరాజు, అమృతా అయ్యర్‌పై చిత్రీకరించిన 'నీలి నీలి ఆకాశం' పాట 100 మిలియన్ వ్యూస్ దాటడంతో చిత్ర బృందమంతా ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. టాలీవుడ్లోనే కాకుండా సౌత్ ఇండియాలోనే ఇదొక అరుదైన ఫీట్‌గా విశ్లేషకులు భావిస్తున్నారు. స్టార్లు లేని ఒక చిన్న సినిమాలోని పాటకు ఈ స్థాయి ఆదరణ లభించడం అపురూపమైన విషయంగా వారు చెబుతున్నారు. ఇటీవల అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమాలోని పాటలు ఈ రికార్డ్ సృష్టించాయి.
అనూప్ రూబెన్స్ ఇచ్చిన వినసొంపైన బాణీలకు చంద్రబోస్ రాసిన కమనీయ సాహిత్యం, సింగర్స్ సిద్ శ్రీరామ్, సునీత సుమధర గానం తోడై ఈ పాటను ఇంత బ్లాక్‌బస్టర్ చేశాయని నిర్మాత ఎస్వీ బాబు అన్నారు. ఈ సందర్భంగా సంగీత ప్రియులకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. సినిమాకు సంబంధించిన అన్ని కార్యక్రమాలు పూర్తయ్యాయనీ, ప్రస్తుతం దేశంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు సమసిపోయి, సాధారణ పరిస్థతి నెలకొన్న తర్వాత చిత్రాన్ని విడుదల చేస్తామనీ ఆయన చెప్పారు. కరోనా మహమ్మారిపై అందరూ కలిసికట్టుగా పోరాడితే విజయం తథ్యమనీ, అందువల్ల లాక్డౌన్ పీరియడ్‌లో ప్రజలందరూ ఇళ్లల్లోనే సురక్షితంగా ఉండాలని ఆయన కోరారు.
30 రోజుల్లో ప్రేమించటం ఎలా' సినిమా ఔట్పుట్ చూసి నచ్చడంతో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని విడుదల చేయడానికి నిర్మాతలతో జీఏ2, యువి క్రియేషన్స్ సంస్థలు ఒప్పందం కుదుర్చుకోవడం విశేషం. ఇలా రెండు అగ్ర డిస్ట్రిబ్యూషన్ సంస్థల సపోర్ట్ లభించడం సినిమాకి ప్లస్ అవుతోంది. ఈ సినిమాలో శివన్నారాయణ, హేమ, పోసాని కృష్ణమురళి, శుభలేఖ సుధాకర్, వైవా హర్ష, హైపర్ ఆది, ఆటో రామ్‌ప్రసాద్, భద్రం, జబర్దస్త్ మహేష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
tollywood
VIEW
KUMAAR
SHIVA
ARYA
CHANDRA BOSE
CHANDRABOSE
HEMA
KRISHNA
RAM POTHINENI
SUMA
SUMA KANAKALA
KOREA
SOUTH
KORCHA
ADINARAYANAREDDY
CINEMA
ALA VENKATAPURAM LO
RAYALASEEMA
YOUTUBE
YOU TUBE
LORD SIVA
PRODUCER1
SUBHAS CHANDRA BOSE
LETTER
ARJUN 1
ARYA 2
ALA VAIKUNTHAPURRAMLOO
ALA VAIKUNTAPURAMLO
AMRITA DHANOA
ARYAA
CHITRAM