`బ్రా` తో మాస్క్‌.. వీడియో చేసి చూపించిన నటి

JSR
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రధాన సమస్య కరోనా. చైనాలో పుట్టిన ఈ ప్రాణాంతక వైరస్ ప్రస్తుతం ప్రపంచ దేశాలన్నింటికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఈ మహమ్మారి కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ ఎంతగానో ప్రయత్నిస్తున్నా ఇంత వరకు సరైన చికిత్స మాత్రం కనిపెట్ట లేకపోయారు. దీంతో మానవాళి మనుగడే ప్రశ్నార్థకంగా మారింది. కరోనాను అంతం చేయలేకపోయినా దాని నుంచి రక్షణ పొందేందుకు ప్రజలు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా మాస్క్ ధరించటం అన్నది కరోనా కట్టడిలో కీలకంగా మారింది.

దీంతో ప్రపంచ వ్యాప్తంగా మాస్క్‌ల కొరత ఏర్పడింది. వైధ్య సిబ్బందికే మాస్కులు అందించటం ప్రభుత్వాలకు తలకు మించిన భారంగా మారుతుంది. దీంతో ప్రజలు సొంతంగా తయారు చేసుకున్న మాస్కులను ధరించాలని సూచిస్తున్నారు ప్రముఖులు. అందులో భాగంగా ఇండియాలో మాస్క్‌ ఇండియా అనే చాలెంజ్‌ను ట్రెండ్ చేస్తున్నారు స్టార్‌.

తాజాగా ఓ హాలీవుడ్ నటి ఓ వింత ప్రయోగం  చేసింది. తను ధరించే బ్రాను మాస్క్‌గా ఎలా వినియోగించుకోవచ్చో వీడియో రూపంలో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. హాలీవుడ్‌ కమెడియన్‌  చెల్సా హ్యాండ్లర్‌ ఈ వీడియోను పోస్ట్ చేసింది. ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా ఇంట్లోనే ఉంటున్న చెల్సా చేసిన ఈ వీడియో కొద్ది క్షణాల్లోనే వైరల్‌గా మారింది. అంతేకాదు వీడియోతో పాటు ఈ మాస్క్‌ను మగాళ్లు కూడా వాడొచ్చు అంటూ కామెంట్ చేసింది చెల్సా.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
With masks in short supply, we have to take matters into our own hands. Men included. #corona #diy

A post shared by Chelsea Handler (@chelseahandler) on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: