ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు.... భావోద్వేగానికి గురైన హీరోయిన్...!
కరోనా మహమ్మారి వల్ల దేశవ్యాప్తంగా ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. దినసరి కూలీలు, పేద ప్రజలు లాక్ డౌన్ వల్ల ఆకలితో అలమటిస్తున్నారు. వైద్య, పోలీస్, పారిశుధ్ధ్య బృందాలు కరోనాను కట్టడి చేయడానికి నిరంతరం శ్రమిస్తున్నాయి. దేశంలో నెలకొన్న పరిస్థితులపై బాలీవుడ్ నటి సెలీనా జైట్లీ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ప్రస్తుతం సెలీనా సినిమాల్లో నటించట్లేదు. ఏప్రిల్ 15న ఈమె నటించిన సీజన్ గ్రీటింగ్స్ షార్ట్ ఫిల్మ్ స్ట్రీమింగ్ కానుంది. త్వరలో షార్ట్ ఫిల్మ్ స్ట్రీమింగ్ కానుండడంతో పెళ్లి అయిన తరువాత రోజు నుంచి తన జీవితంలో జరిగిన మార్పులను అభిమానులతో పంచుకున్నారు. సెలీనా ఆ పోస్ట్ లో తాను అభిమానులతో 2011లో చివరి పోస్ట్ చేశానని పేర్కొన్నారు. ఆ తరువాత మరో పోస్ట్ చేయడానికి ఇన్ని సంవత్సరాలు పడుతుందని అస్సలు ఊహించలేదని తెలిపారు.
కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో.... ఒక చిన్న వైరస్ కారణంగా ప్రపంచమంతా మూసివేయబడుతుందని తాను అస్సలు ఊహించలేదని అన్నారు. తన ప్రతి సినిమాపై అభిప్రాయం చెప్పే తల్లిదండ్రులు సజీవంగా ఉండరని అనుకోలేదని అన్నారు. ప్రస్తుతం తాను వివాహం చేసుకుని యూరప్ లో ఉంటున్నానని పేర్కొన్నారు. ముగ్గురు పిల్లలకు తల్లి అయిన తరువాత తరువాత సినిమా విడుదల అవుతుందని అస్సలు ఊహించలేదని చెప్పారు.
తాను జీవితం అనూహ్యమని తెలుసుకున్నానని చెప్పారు. రేపు కోసం వేచి ఉండకుండా.. ఈ రోజును ఉత్తమంగా చూడాలి అని అన్నారు. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న సమయంలో విడుదలవుతున్న సీజన్ గ్రీటింగ్స్ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుందని అన్నారు. సీజన్ గ్రీటింగ్స్ ప్రేక్షకులను వినోదాన్ని అందిస్తుందని తెలిపారు. 16 సంవత్సరాల క్రితం మంచు విష్ణు హీరోగా నటించిన సూర్యం సినిమాలో సెలీనా హీరోయిన్ గా నటించారు.
auto 12px; width: 50px;">View this post on InstagramAFTER A SUCCESSFUL STINT WORLDWIDE AT {{RelevantDataTitle}}