సినిమాల్లేని వాళ్లని చూసి కాలరెగరేస్తున్న డైరెక్టర్లు
ప్రజెంట్ టాలీవుడ్ లో స్టార్ డైరెక్టర్ అయిన త్రివిక్రమ్ మొన్నా మద్య అలవైకుంఠపురంలో సినిమా చేసి మంచి సక్సెస్ అందుకున్నాడు . బన్నీతో సినిమా అయిపోగానే.. ముందునుంచీ అనుకున్నట్టు గానీ ఎన్టీఆర్ తో సినిమా అనౌన్స్ చేశాడు త్రివిక్రమ్. ఈ సంవత్సరం ఏప్రిల్ లో సినిమా స్టార్ట్ చేసి నెక్ట్స్ మే కి రిలీజ్ చేద్దామని అఫీషయిల్ గా చెప్పారు త్రివిక్రమ్ అండ్ టీమ్. ఈ సినిమా ఇంకా స్టార్ట్ అవ్వకముందే చిరంజీవి, త్రివిక్రమ్ ని లైన్లో పెట్టేశారు. ఎప్పటినుంచో మెగాస్టార్ తో సినిమా చేద్దామనుకుంటున్న త్రివిక్రమ్.. చిరంజీవికి మంచి స్టోరీ చెప్పి ఇంప్రెస్ చేసేశాడు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో మంచి ఫామ్ లో ఉన్న మరో డైరెక్టర్ శివనిర్వాణ. నానితో నిన్నుకోరి సినిమా తరువాత నాగచైతన్య, సమంత కాంబినేషన్లో మజిలీ మూవీ చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు . ఇప్పుడు మళ్లీ నానితో టక్ జగదీష్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉండగా ... రౌడీ హీరో విజయ్ దేవరకొండకి స్టోరీ చెప్పి.. విజయ్ తో నెక్ట్స్ సినిమాకి ఖర్చీఫ్ వేసేసుకున్నాడు.