మా నాన్నకు ఓ.... ఎస్కోండి: స్టార్ హీరో

JSR
బాలీవుడ్ సూపర్‌ స్టార్ హృతిక్‌ రోషన్‌ ఫిట్‌ నెస్ గురించి అందరికీ తెలిసిందే. గ్రీక్‌ గాడ్‌ లా సెక్సీ స్ట్రక్చర్ మెయిన్‌టైన్ చేసే హృతిక్‌ ఈ జనరేషన్ యూత్‌కి ఇన్సిపిరేషన్‌. అయితే హృతిక్ మాత్రమే కాదు ఆయన తండ్రి, స్టార్ డైరెక్టర్ రాకేష్‌ రోషన్‌ కూడా అదే స్థాయిలో ఫిట్ నెస్ మెయిన్‌ టైన్ చేస్తాడు. సోమవారం తన ఇన్‌స్టా గ్రామ్‌లో ఆసక్తికర వీడియోను షేర్ చేశాడు హృతిక్‌.

తన తండ్రి వర్క్ అవుట్ చేస్తూ చెమటోడుస్తున్న ఈ వీడియో ఎంతో మందికి ఇన్స్‌పైరింగ్‌గా ఉంది. జిమ్‌ తండ్రి వర్క్‌ అవుట్ చేస్తున్ వీడియోలను పోస్ట్ చేస్తూ ఆనందంతో ఉప్పొంగిపోతున్నాడు హృతిక్‌. ఆ వీడియోతో పాటు `ఒంటరిగా ఉన్నాడు. 70 ఏళ్ల వయసులో 17 ఏళ్ల కుర్రాడిలా పరిగెడుతున్నాడు. నాకు ఈ జెనెటిక్స్‌ ఎందుకురాలేదు. మిలటరీ మ్యాన్, నేను పెద్ద వాడిని అయ్యాక ఇలాగే ఉండాలి. ఇంతకన్నా నాకు ఇన్స్‌పైరింగ్‌ విషయం ఇంకొటి ఉండదు. మా నాన్నకు ఓ ఏస్కోండి` అంటూ ట్వీట్ చేశాడు.

రాకేష్ రోషన్ ఇటీవల క్యాన్సర్‌ చికిత్స తీసుకున్నారు. తరువాత హృతిక్‌ హీరో గా క్రిష్‌ 4ను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు. అదే సమయంలో లాక్ డౌన్‌ ప్రకటించటంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. అయితే ఈ ఖాళీ సమయంలో మరింతగా రికవర్‌ అయ్యేందుకు రెగ్యులర్‌గా వర్క్ అవుట్స్ చేస్తున్నాడు రాకేష్‌ రోషన్‌.

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
. Alone . But at it ! .. @rakesh_roshan9 #70running17 #whydidinotgethisgenetics #militaryman #fitnessmotivation #whenigrowupiwannabelikehim #daddycool😎 . This seriously is more inspiring to me than anything else . My daily dose . Give him a shout guys .

A post shared by Hrithik Roshan (@hrithikroshan) on

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: