ఆ బడా నిర్మాత.. సినీ కార్మికులపై చిన్న మనసు..?

praveen

ప్రస్తుతం దేశవ్యాప్తంగా లాక్ డౌన్  కొనసాగుతున్న సమయంలో సినిమా షూటింగ్ లన్ని  ఆగిపోయిన విషయం తెలిసిందే. స్టార్ హీరోల సినిమా నుంచి చిన్న హీరోల సినిమాలకు పూర్తిగా అన్ని సినిమాల చిత్రీకరణ ఆగిపోయాయి. అయితే సినిమా షూటింగ్ లన్ని  ఆగిపోయిన నేపథ్యంలో హీరోలు దర్శకులు నిర్మాతల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ.. సినీ కార్మికుల పరిస్థితి మాత్రం  రోజురోజుకు దారుణంగా మారిపోతుంది. రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి లో ఉండే సినీ కార్మికులు ప్రస్తుతం చాలా రోజుల నుండి ఉపాధి కరువవడంతో కనీసం తినడానికి తిండి కూడా లేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. కిందిస్థాయి సినీ కార్మికులు అందరూ ప్రస్తుతం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నాయి. 

 

 

 అయితే లాక్ డౌన్  నేపథ్యంలో దారుణ పరిస్థితి చేరుకున్న సినీ కార్మికులను  ఆదుకోడానికి ఎంతో మంది సినీ ప్రముఖులు ముందుకు వచ్చి తన మంచి మనసు చాటుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో  సినీ కార్మికులు ఆకలి బాధలు తీర్చేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సిసిసి అనే కార్యక్రమం చేస్తున్నారు . చిరంజీవి అధ్యక్షతన ఏర్పాటైన ఈ ట్రస్ట్... కార్మికులందరికీ ప్రతిరోజు నిత్యవసర వస్తువులను అందిస్తున్నారు. అయితే ఈ కార్యక్రమానికి పలువురు విరాళాలు  కూడా అందజేస్తున్నారు. ఇదిలా  ఉంటే  చాలా మంది బడా హీరోలు బడా నిర్మాతలు మాత్రం ఇప్పటివరకు ఎలాంటి విరాళాలు ఇవ్వకపోవడం   అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది . 

 

 

 ఒక బడా నిర్మాత కార్మికుల సమావేశం ఏర్పాటు చేసిన సీసీసి  కి ఐదు లక్షల విరాళం ప్రకటించారు. అయితే సదరు బడా నిర్మాత వందల కోట్ల ఆస్తులు ఉన్నాయి... భారీ బడ్జెట్ సినిమాలని  తెరకెక్కిస్తున్నారు. అలాంటి బడ బడ నిర్మాతలు  కూడా కేవలం ఐదు లక్షలు మాత్రమే ఇవ్వడం సరికాదంటున్నారు నెటిజన్లు. కనీసం 25 లక్షలు విరాళంగా ఇస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఒక ప్రముఖ దర్శకుడు కూడా తన పారితోషికం విషయంలో చిన్న మనసు బయటపెట్టాడు అంటూ విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే సినీ స్టార్స్ ఈ స్థాయికి ఎదడానికి  స్టార్స్ సినీ కార్మికులు కారణమని  అందరూ గుర్తుంచుకుని ప్రస్తుతం సినీ కార్మికులు ఇబ్బందుల్లో ఉన్న నేపథ్యంలో వారికి చేయూతనిచ్చేందుకు ముందుకు వస్తే బాగుంటుంది .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: