"ఆర్ఆర్ఆర్" ప్రభావం "అయినను పోయిరావలె హస్తినకు" మీద పడనునుందా...?

Suma Kallamadi

ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో స్టార్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ లో నటిస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈ సినిమాలో వీరి సరసన ఒలీవియా మేరీ, బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ని రామ్ చరణ్ బర్త్ డే ఈ సందర్భంగా విడుదల చేయడం జరిగింది. ఆ తర్వాత చరణ్ పాత్ర కు సంబంధించిన టీజర్ కూడా విడుదల చేయడం జరిగింది. దీనితో సినిమా మీద ఉన్న ఆశక్తి మరింత బాగా పెరిగింది అభిమానుల్లో..

 


ఇక అసలు విషయానికి వస్తే... ఈ సినిమా అనంతరం ఎన్టీఆర్, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా తీస్తున్నట్లు అందరికీ తెలిసిన విషయమే. గతంలో అరవింద సమేత వీర రాఘవ సినిమా లో మాస్ హీరోగా ఎన్టీఆర్ ని చూపించాడు త్రివిక్రమ్. సినిమా మంచి కమర్షియల్ విజయం సాధించింది. అలాగే తర్వాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో అల వైకుంఠపురం లో  సినిమా ఇండస్ట్రీలో మంచి హిట్ గా నిలిచింది. ఇక త్రివిక్రమ్ ఎన్టీఆర్ కలిసి తీసే సినిమా ఎన్టీఆర్ కు 30 వ సినిమా కావడం చాలా విశేషమైన విషయం. ఈ సినిమాలో కూడా ఆ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఆయనను " పోయి రావలె హస్తినకు" అన్న టైటిల్ నిర్ధారించడం జరిగింది. 

 

 

ప్రస్తుతం ఈ సినిమా విషయంలో త్రివిక్రమ్ బాగా ప్రెజర్ ఉన్నట్లు అర్థమవుతోంది త్రివిక్రమ్ కి. అందుకు ముఖ్య కారణం ఆర్ఆర్ఆర్ సినిమా అనే చెప్పాలి. వాస్తవానికి ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా ఎన్టీఆర్ ప్లేస్ దక్కించుకోవడం ఖచ్చితం అని ఇప్పటికే ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం ఎన్టీఆర్ త్రివిక్రమ్ తీసే సినిమా అదే తరుణంలో ఉండాలని అభిమానులు ఆశిస్తున్నారు. ఎందుకు ఒక పరంగా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రభావం అర్థమవుతుంది. అందుకోసం త్రివిక్రమ్ మళ్ళీ ఆ సినిమా స్క్రిప్ట్ ను పాన్ ఇండియా స్క్రిప్ట్ గా మళ్ళీ రాయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: