'ఏయ్‌ కోలీ.. చౌకా మార్‌.. చౌకా.. క్యా కరా రే’ అంటూ కోహ్లీని ఆటపట్టిస్తున్న అనుష్క

కరోనా వైరస్ కారణంగా దేశం మొత్తం ఇళ్లలో బందీ అయ్యిందని చెప్పవచ్చు. లాక్ డౌన్ తో ఇంటికే ప‌రిమిత‌మైన సెలెబ్రెటీస్.. బోర్ కొడుతుండ‌డంతో సోష‌ల్ మీడియాలో ర‌క‌రకాల పోస్టులు పెడుతూ టైమ్ పాస్ చేస్తున్నారు. మామూలుగానైతే ఎప్పుడు కొంచెం ఖాళీ సమయం దొరికినా.. విహార యాత్రలకో లేక వీధుల్లోనో షికార్లు కొట్టే వాళ్లు. కానీ ఇప్పుడు ప్రపంచం మొత్తం లాక్‌డౌన్ దశలో ఉండటంతో గడప దాటి ఎటూ వెళ్లలేని పరిస్థితి నెలకొంది. ఇంట్లోనే ఖాళీగా కూర్చున్న సెలెబ్రెటీలు సోషల్ మీడియా ద్వారా అభిమానులకు టచ్ లో ఉంటూ వినోదాన్ని పంచుతున్నారు. కొంతమంది హాట్ హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ హీట్ పెంచేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే హీరోయిన్లు రకరకాల పోస్టులతో ఫ్యాన్స్‌ని ఎంటర్‌టైన్ చేస్తున్నారు.

 

ఇప్పటికే లాక్ డౌన్ ఎత్తేయాల్సి ఉన్నా కరోనా పరిస్థితులు కంట్రోల్ కాకపోవడంతో మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించిన విషయం తెలిసిందే. దీంతో మరో మూడు వారాల పాటు సెలెబ్రెటీలు ఇంటికే పరిమితం కానున్నారు. దీంతో రోజుల తరబడి ఇంట్లో ఖాళీగా కూర్చుని ఏం చేయాలో అర్థం కాని సెలబ్రిటీలు.. క్వారంటైన్ పేరిట తమకు దొరికిన ఈ ఖాళీ సమయాన్ని ఎవరికి తోచినట్టుగా వాళ్లు ఉపయోగించుకుంటున్నారు. ఇక విరాట్ కోహ్లీ - అనుష్క శర్మ విషయానికొస్తే ఇంట్లోనే ఉంటూ వీరిద్దరూ లాక్‌డౌన్‌ను ఆస్వాదిస్తున్నారు. అదే సమయంలో సోషల్‌ మీడియాలో కూడా అలరిస్తూనే ఉన్నారు. కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌ కొనసాగుతుండటంతో క్రీడా ఈవెంట్లు ఏమీ జరగడం లేదు. దాంతో అభిమానులకు కోహ్లి ఆట దూరమై పోయింది.

 

ఈ నేపథ్యంలో కోహ్లీ భార్య అనుష్క శర్మ.. 'ఏయ్‌ కోలీ.. చౌకా మార్‌.. చౌకా.. క్యా కర్రా రే’ అంటూ సరదాగా ఏడిపించే యత్నం చేసింది. అనుష్క అల్లరికి కోహ్లి బిత్తరచూపులు చూడటం తప్పితే చేసేదేమీ లేకపోయింది. దీనికి సంబంధించిన వీడియోలను అనుష్క శర్మ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేసింది. 'కోహ్లీ క్రికెట్ గ్రౌండ్ ని మిస్ అవుతున్నాడు.. దాంతో పాటు అతని ఫ్యాన్స్ ని కూడా మిస్ అవుతున్నాడు... ముఖ్యంగా ఈ విధంగా ఎంకరేజ్ చేసే ఫ్యాన్స్ ని బాగా మిస్ అవుతున్నదంటూ' కామెంట్ జత చేసింది. ఇటీవల కోహ్లికి న్యూ హెయిర్‌ కట్‌ ట్రై చేసిన అనుష్క శర్మ.. ఇప్పుడు తాజాగా కోహ్లీని ఇలా ఆట పట్టించింది. మొత్తం మీద ఈ 'విరుష్క' జంట లాక్ డౌన్ సమయాన్ని బాగానే ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఇంకెందుకు ఆలస్యం మీరు ఓ లుక్కెయ్యండి. 

 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
I thought he must be missing being on the field. Along with the {{RelevantDataTitle}}