సుమ విత్ సూపర్ ఫోర్.. లాక్ డౌన్ లో కూడా ఎంటర్టైన్ చేస్తున్న తెలుగు యాంకర్స్..!
అనుకోవాలే కానీ ఏదైనా చేయగలం.. ఇది ఇలాంటి టైం లో బాగా సూట్ అవుతుంది. ఒక కాన్సెప్ట్ తేరా మీదకు రావాలంటే ఓ పెద్ద హంగామా చేసి.. మేకప్, కెమెరాలు, యూనిట్లు ఇలా హడావిడి బాగా ఉంటుంది. కానీ లాక్ డౌన్ వల్ల ఎవరి ఇంట్లోనే వారు ఉంటూ ఎంటర్టైన్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇప్పటికే సినీ స్టార్స్ అంటా తమ షార్ట్ ఫిలిం తో అదరగొట్టగా.. సినిమా తారాలేనా మేము చేయలేమా అని బుల్లితెర నటీనటులు కలిస్ ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు. ఇక ఇప్పుడు యాంకర్ల క్యూ వచ్చింది.
టాప్ యాంకర్ సుమ అదే రేంజ్ లో ఫామ్ కొనసాగిస్తున్న నలుగురు యాంకర్లు కలిస్ సూపర్ ఫోర్ అనే ప్రోగ్రామ్ చేశారు. హ్యాష్ ట్యాగ్ సుమక్క సూపర్ ఫోర్ అంటూ చేసిన ఈ ప్రోగ్రామ్ సుమ యూట్యూబ్ ఛానెల్ లో రాబోతుంది. ఈరోజు సాయంత్రం 5 గంటలకు ఈ ప్రోగ్రామ్ వస్తుందట. సుమ సూపర్ ఫోర్ లో ఫీమేల్ యాంకర్స్ అనసూయ, రష్మీ, ప్రదీప్, రవి పాల్గొన్నారు. ఈ నాలుగురితో పాటు సుమ చేసిన అల్లరి చూడాలంటే ఈరోజు సాయంత్రం రిలీజ్ అవుతున్న సుమ సూపర్ ఫోర్ షో చూడాల్సిందే. మాములుగా వీళ్ళు ఐదుగురు కలిసి షో చేయాలంటే పెద్ద సెటప్ ఉండాలి. కానీ ఎవరికి వారు తమ ఇంట్లో ఉంటూ స్వతహాగా తమ సెల్ ఫోన్లతో ఈ వీడియో తీశారు. లేటెస్ట్ గా ఈ షో ప్రోమో రిలీజ్ చేశారు. అందరు ప్లేట్లు, గంటెలతో కనిపించరు. అనసూయ మాత్రమే స్పూన్ తో కనిపించింది.
మరి వీళ్ళు చేసే అల్లరి ఎలా ఉంటుందో చూడాలంటే సుమ యూట్యూబ్ ఛానెల్ సుమక్కని ఫాలో అవ్వాల్సిందే. లాక్ డౌన్ టైం లో ఇంట్లో ఉంటూనే ఆడియెన్స్ ను ఎంటర్టైన్ చేయాలని వీరి ప్లాన్ బాగుందని చెప్పొచ్చు. మరి సుమ విత్ సూపర్ ఫోర్ ఈ ప్రోగామ్ కాన్సెప్ట్ ఏంటి.. ఇది ఎలా ఉంటుంది అన్నది తెలియాలంటే ఈరోజు సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే.
auto 12px; width: 50px;">View this post on InstagramSumakka super4 teaser . watch out for episode tomorrow at 5pm on @sumakka_ youtube channel A post shared by suma Kanakala (@kanakalasuma) on