టిక్ టాక్ లో రెచ్చిపోయిన డాక్టర్ బాబు ...!

Suma Kallamadi

 


పరిటాల నిరుపం... ఈ పేరు చెప్తే కొంతమంది గుర్తుపట్టవచ్చు, కొంతమంది గుర్తు పట్టకపోవచ్చు. డాక్టర్ బాబు అంటే ఇట్టే గుర్తుపట్టేస్తారు ఆయన ఎవరో కాదండి పరిటాల నిరుపమే. కార్తీకదీపం సీరియల్ ఆయన అంత క్రేజ్ తెచ్చి పెట్టింది మరి. ఎన్నో అంచనాల మధ్య సాగుతున్న ఈ సీరియల్ కి కరోనా వైరస్ బ్రేక్ వేసింది. ఆ బాధ తెలియకుండా ఉండటానికి హీరో అప్పుడప్పుడు లైవ్ లోకి వస్తూ వారి అభిమానులను సంతోష పరుస్తూ ఉంటాడు. అంతే కాదు ఇంట్లో ఉండి ఆయన స్వతహాగా తన భార్యతో కలిసి టిక్ టాక్ వీడియో చేసి రిలీజ్ చేస్తూ ఉన్నాడు.

 


రీసెంట్ గా డాక్టర్ బాబు తన భార్యని మంజులతో కలిసి ఫన్నీ టిక్ టాక్ రిలీజ్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో చాలా ట్రెండ్ గా మారింది నెట్టింట్లో. ఇవి కాస్త ఇందులో లాక్ డౌన్ మీద కరెంట్ సిచువేషన్ తగినట్టుగా ఉండడంతో అవన్నీ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. లాక్ డౌన్ కారణంగా కేవలం ఇంట్లో ఉండడమే కాకుండా ఇంట్లో విషయాల్ని పంచుకోవాలని. ఇంట్లో భార్యలకి హెల్ప్ చేయాలని ఇందులో చెప్పుకొచ్చాడు.కేవలం యాక్టింగ్, పాటలు డాన్స్ కాకుండా టిక్ టాక్ లో తన ఓన్ వాయిస్ ని క్రియేట్ చేసి నిరుపమ్ దంపతులు టిక్ టాక్ ని రిలీజ్ చేస్తున్నారు. 

 


అయితే ఈ మధ్య చేసిన ఒక టిక్ టాక్ లో లాక్ డౌన్ స్టార్ట్ కాగానే బయటికి వెళితే పోలీసులు ఉతికి ఆరేస్తున్నారు. దానికంటే హెల్ప్ చేయడం బెటర్ అని మీనింగ్ వచ్చేలా చేసిన టిక్ టాక్ ఇప్పుడు బాగా వైరల్ గా మారింది. అంతేకాదు ఆ తర్వాత చేసిన 2, 3 వీడియోలు కూడా అదే రేంజ్ లో షేర్లు, లైక్ లతో నిరుపం తన ప్రతిభను చాటుకున్నాడు. అయితే కొత్తగా ఓ టిక్ టాక్ విడుదల చేశాడు ఇప్పుడు దాని పరిస్థితి ఏంటో ఒకసారి చూద్దాం. 

 
 
 
 
auto 12px; width: 50px;"> 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
Lockdown saaramsam 😜 @paritala_manjula #homequarantine #familytime

A post shared by Nirupam Paritala (@nirupamparitala) on


మంజుల : వైరస్(కరోనా) రాకుండా ఉండాలంటే..?
నిరుమప్ : ఇంట్లోనే ఉండాలి..
మంజుల : ఇంట్లోనే ఉండాలంటే..?
నిరుమప్ : ఇంటి పనుల్లో హెల్ప్ చెయ్యాలి..
మంజుల : ఇల్లు ఊడ్వాలంటే..?
నిరుమప్ : ముందుకెళ్లాలి..
మంజుల : ఇల్లు తుడవాలంటే..?
నిరుమప్ : వెనక్కి రావాలి..
మంజుల : బ్రేక్ ఫాస్ట్‌లో..?
నిరుమప్ : బ్రెడ్డు
మంజుల : దాంతో పాటు?
నిరుమప్ : గుడ్డు
మంజుల : పప్పు బాగుండాలంటే..?
నిరుమప్ : ఉప్పుండాలి..
మంజుల : పప్పు మిగిలిపోతే..?
నిరుమప్ : నీళ్లు పోసి చారు చెయ్యాలి..
మంజుల : టీలో వెయ్యాల్సింది?
నిరుమప్ : అల్లం
మంజుల : వేస్ట్ చెయ్యకూడనిది?
నిరుమప్ : అన్నం
మంజుల : రాత్రికి?
నిరుమప్ : యూ నాటీ... ఆ.. కాదు రోటీ...
మంజుల : లాక్ డౌన్ పాటించడం..?
నిరుమప్ : మన డ్యూటీ..
ఇలా సాగిన ఈ టిక్ టాక్ అదిరిపోయిందనే రెస్పాన్స్ వస్తోంది. నిజంగానే అదిరిపోయింది కదా.. మరి మీరు ఓ లుక్ వెయ్యండి..


ఇలా వారి సంభాషణ కొనసాగించి వారు అందిరికి నవ్వులు పూయించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: