పుష్ప సినిమాకు మరో దెబ్బ.. అందుకే ఆ నిర్ణయం.. !

NAGARJUNA NAKKA

కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్స్ బంద్ అయితే.. బన్నీ నటిస్తున్న పుష్ప సినిమాకు మరో దెబ్బ తగిలింది. కరోనాను కారణంగా చూపి.. సినిమాలో ముఖ్య పాత్ర పోషిస్తున్న నటుడు తప్పుకున్నాడు. దీంతో ఆయన ప్లేస్ ను బాలీవుడ్ నటుడితో భర్తీ చేస్తున్నాడు నటుడు సుకుమార్. 

 

ఆర్య, ఆర్య 2 తర్వాత బన్నీ, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కడంతో.. తమిళ మార్కెట్ కు దగ్గర కావడానికి విజయ్ సేతుపతిని విలన్ గా తీసుకున్నారు. ఏప్రిల్ మొత్తం పుష్ప సినిమాకు డేట్స్ ఇచ్చాడు విజయ్. కరోనా హాలిడేస్ తో డేట్స్ వేస్ట్ కావడంతో.. మిగతా సినిమాల కమిట్ మెంట్స్ రీత్యా.. పుష్ప నుంచి తప్పుకున్నాడట. 

 

విజయ్ సేతుపతి ప్లేస్ ను బాలీవుడ్  సీనియర్ హీరో సునీల్ శెట్టితో భర్తీ చేస్తున్నారని తెలిసింది. లెక్కల మాస్టారు చేసే ప్రతీ పనికి ఓ లెక్క ఉంటుంది. పుష్ప పాన్ ఇండియా మూవీగా తెరకెక్కడంతో.. ఈ సారి బాలీవుడ్ యాక్టర్ ను విలన్ గా తీసుకోవాలనుకున్నాడు సుకుమార్. 

 

58ఏళ్ల సునీల్ శెట్టి.. సౌత్ ఇండియా మూవీస్ పై దృష్టిపెట్టాడు. పుష్పలో నటిస్తే.. ఈ బాలీవుడ్ హీరో నటిస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే అవుతుంది. పాన్ ఇండియాగా తెరకెక్కిన కన్నడ చిత్రం పహిల్వాన్ మూవీలో సుదీప్ కు గురువుగా నటించాడు. ఆ మధ్య వచ్చిన దర్బార్ లో విలన్ గా కనిపించాడు. ఈ సారి పుష్ప మూవీలో ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో విలనిజం చూపించనున్నాడు సునీల్ శెట్టి. 

 

పుష్ప సినిమాతో బన్నీ హిందీలోకి అడుగుపెడుతున్నాడు. దీంతో విలన్ నుంచి ఐటం గర్ల్ వరకు అక్కడి నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. సుకుమార్ తన ప్రతి సినిమాలో ఐటం సాంగ్ ఉండేలా జాగ్రత్త పడతాడు,. పుష్పకోసం దేవిశ్రీ ప్రసాద్ అదిరిపోయే ఐటం ట్యూన్ రెడీ చేశాడట. ఇందులో ఆడిపాడటానికి బాలీవుడ్ హాట్ బ్యూటీ.. ఊర్వశి రౌతాలా పేరు వినిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: