మెగాస్టార్ నీ నిర్ణయానికి జోహార్ ...!
ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాలలో కరోనా మహమ్మారి చాపకింద నీరులాగా విరుచుకుపడుతుంది అని చెప్పవచ్చు. దీనితో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమవుతున్నాయి. పేద, మధ్యతరగతి కుటుంబాల నుంచి పెద్ద ఇండస్ట్రీల వరకు అన్నీ కూడా మూతపడ్డాయి. గడిచిన రెండు నెలల నుంచి ఇంకా ఇప్పటి వరుకు తెలియదు ఈ పరిస్థితి చక్క పడుతుందో. దీనితో ప్రజలు సతమతమవుతున్నారు. ఇది ఇలా ఉండగా రోజురోజుకీ తెలుగు రాష్ట్రాలలో పరిస్థితి చాలా దారుణంగా మారుతుంది. రోజురోజుకీ కేసుల సంఖ్య భారీగా పెరిగిపోతూ వస్తోంది. ఈ తరుణంలో తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలో మే 7 వరకు లాక్ డౌన్ విధానాన్ని పొడగించారు.
ఈ తరుణంలో.. మధ్యతరగతి కుటుంబాలు, రోజువారి పనులు చేసుకొని జీవనం కొనసాగించేవారు చాలా రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారి కోసం చాలా ప్రయత్నాలు చేస్తు విజయం సాధిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా బాధ్యతారహితంగా వహిస్తూ తమ చుట్టు పక్కన ఉన్న పేద మధ్యతరగతి కుటుంబాలను ఆదుకునే వస్తున్నారు. అలాగే మన తెలుగు ఇండస్ట్రీ వారందరూ కూడా వారి వంతు సహాయం అందిస్తూ ప్రజలను ఆదుకుంటూ ఉన్నారనే చెప్పాలి. వారు తమ వంతు సహాయం చేస్తూ ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ లకు ఆర్థికపరంగా సహాయం చేస్తూనే వస్తున్నారు అగ్రహీరో స్టార్ హీరోలు. అంతేకాకుండా మెగాస్టార్ చిరు ఆధ్వర్యంలో CCC అనే సంస్థ కూడా ఏర్పాటు చేసి పేద ప్రజలకు అండగా నిలబడుతున్నారు.
ఈ సంస్థ ద్వారా దాదాపు 12000 పేద ప్రజల కుటుంబాలకు నెలకు సరిపడా నిత్యావసర సరుకులు అందచేస్తూ వారికి అండగా నిలుస్తున్నారు. ఈ కార్యక్రమం చిరంజీవి ఎన్.శంకర్ ఆధ్వర్యంలో కొనసాగుతుంది. ఇందులో భాగంగా మెగా బ్రదర్స్ ఫ్యామిలీ హీరోల నుంచి నాగార్జున ఫ్యామిలీ, దగ్గుబాటి వెంకటేష్ ఫ్యామిలీ, నాని, మహేష్ బాబు, కాజల్, తమన్నా, కార్తికేయ... ఇలా చాలా హీరో హీరోయిన్లు భాగస్వామి అయ్యారు. వీరందరూ కలిసి కట్టుగా హైదరాబాద్ చుట్టుపక్కల ఏరియాలో నివసించే పేద కుటుంబాల అందరికీ నేరుగా వారికి సరిపడే నిత్యావసర సరుకులను అందచేస్తున్నారు.
ఈ సందర్భంలో మెగాస్టార్ చిరు ఒక క్లారిటీ ఇస్తూ.. ఇలాంటి పరిస్థితి ఇలాగే ఉంటే రెండు నెలలపాటు పేద మధ్యతరగతి వారికి నిత్యావసర సరుకులు అందజేస్తామని తెలియజేశారు. దీనితో పాటు తనకు ఉన్న పెద్ద పెద్ద వాళ్ళ పరిచయాలతో జీవీకే, జిఎంఆర్ లాంటి వారి దగ్గరనుంచి సహాయం అడిగి.. పేద, మధ్యతరగతి వారికి అండగా నిలుస్తామని చిరంజీవి తెలియజేయడం జరిగింది.