సందీప్ వంగా ఛాలెంజ్ స్వీకరించి వీడియో పోస్ట్ చేసిన రాజమౌళి... ఎవరెవరికి ఛాలెంజ్ విసిరారంటే...?
అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ వంగా దర్శకధీరుడు రాజమౌళికి ఛాలెంజ్ విసిరిన సంగతి తెలిసిందే. ‘బీ ది రియల్మన్’ అనే పేరుతో సందీప్ వంగా ఇంటి పనులు చేస్తూ ఒక వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. తాను చేసిన విధంగానే రాజమౌళి కూడా ఒక వీడియోను ట్విట్టర్ వేదికగా పంచుకుంటూ ఇతరుల్లో స్పూర్తి నింపాలని కోరారు. నిన్న సందీప్ ఛాలెంజ్ ట్వీట్ ను స్వీకరించిన రాజమౌళి ఈరోజు సోషల్ మీడియాలో ఆ వీడియోను పోస్ట్ చేశారు.
జక్కన్న ఇల్లు ఊడుస్తూ, కిటికీలు, తలుపులు శుభ్రం చేస్తూ, బండలు తుడుస్తూ ఛాలెంజ్ ను పూర్తి చేశారు. ఈ వీడియోలో రమా రాజమౌళి వంట చేస్తూ కనిపించారు. దర్శకధీరుడు రాజమౌళి ఎన్టీయార్, రామ్ చరణ్ లను బీ ది రియల్ మన్ ఛాలెంజ్ కు నామినేట్ చేశారు. సందీప్ వంగా మగవాళ్లు చాలా గొప్ప పనివారని... పనివాళ్లు అందుబాటులో లేని సమయంలో స్త్రీలకు సహాయసహకారాలు అందించాలని సూచించిస్తూ రాజమౌళికి ఛాలెంజ్ విసిరారు.
ఈరోజు ఉదయం ఒక టీవీ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన రాజమౌళి తాను వంట తప్ప అని పనులు చేస్తానని.... తన బట్టలు తనే ఉతుక్కుంటానని చెప్పుకొచ్చారు. ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విశేషాలను కూడా వెల్లడించారు. ఆర్ఆర్ఆర్ ఫిక్షనల్ స్టోరీ అని ఫ్రెండ్ షిప్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నామని అన్నారు. తాను కేవలం పాత్రలను తీసుకున్నానని... చరిత్రకు ఈ కథకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు.
ఆర్ఆర్ఆర్ దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కడం లేదని.... అభిమానులను అలరించే అన్ని అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని చెప్పారు. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత మహేష్ బాబుతో సినిమాను తెరకెక్కించనున్నట్లు ప్రకటన చేశారు. 2021 సంవత్సరం జనవరి 8వ తేదీన ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కానుంది. బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్, హాలీవుడ్ హీరోయిన్ ఒలీవియా మోరిస్ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు.
Task done, @imvangasandeep. Throwing the challenge to @tarak9999 and @AlwaysRamCharan..
And lets have some moooreee fun..
Am also challenging @Shobu_ garu, sukku @aryasukku and peddanna @mmkeeravaani..😈😈 #BetheREALMAN pic.twitter.com/DepkfDvzIE — rajamouli ss (@ssrajamouli) April 20, 2020