లాక్ డౌన్ లో చూడాల్సిన ఉదయ్ కిరణ్ టాప్ 5 మూవీస్ ఇవే..!
1980 లో జన్మించిన ఉదయ్ కిరణ్ తన 19వ ఏట అనగా 1999వ సంవత్సరంలో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. తాను హింగ్లీష్ సినిమా అయిన మిస్టీరియస్ గరల్ మొదటిగా నటించాడు. అనంతరం 2000 సంవత్సరంలో తేజ దర్శకత్వంలో చిత్రం సినిమా ద్వారా టాలీవుడ్ పరిశ్రమలో అడుగు పెట్టి సంచలనం సృష్టించాడు. ప్రస్తుతం భారతదేశం అంతటా లాక్ డౌన్ కొనసాగుతున్న వేళ మేము ఈ ఆర్టికల్ ద్వారా తెలియజేయ బోయ్ ఉదయ్ కిరణ్ యొక్క ఐదు ఉత్తమ చిత్రాన్ని చూసి ఎంజాయ్ చేయండి.
1. చిత్రం
మే 25 2000 సంవత్సరంలో దాదాపు నూతన తారాగణంతో తెరకెక్కిన చిత్రం సినిమా... కాలేజీ పిల్లల ప్రేమ నేపథ్యంలో కొనసాగుతుంది. అతి తక్కువ బడ్జెట్ తో విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చాలా మొత్తం లో డబ్బులను వసూల్ చేసింది. ఉదయ్ కిరణ్ సరసన రీమాసేన్ నటించి బాగా పాపులర్ అయింది. ఎన్ని సార్లు చూసినా బోర్ కొట్టక పోవడం ఈ చిత్రం యొక్క గొప్పతనం చెప్పుకోవచ్చు.
2. నువ్వు నేను
2001వ సంవత్సరంలో దర్శకుడు తేజ దర్శకత్వంలో తెరకెక్కిన నువ్వు నేను సినిమా లో ఉదయ్ కిరణ్, నటీమణి అనిత హీరో హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలో సపోర్టింగ్ పాత్రలలో తెలంగాణ శకుంతల, తనికెళ్ల భరణి, బెనర్జీ తదితరులు నటించి తెలుగు ప్రేక్షకులను ఎంతో అలరించారు. నువ్వు నేను చిత్రం సౌత్ ఫిలిం ఫేర్ అవార్డులను గెలుచుకుంది. అలాగే 5 నంది అవార్డును కూడా గెలుచుకుంది. ఈ సినిమాలో నటించినందుకు గాను ఉదయ్ కిరణ్ కి బెస్ట్ ఫిలింఫేర్ యాక్టర్ అవార్డు లభించింది.
3. మనసంతా నువ్వే
అక్టోబర్ 19 2001 సంవత్సరంలో దర్శకుడు వి.ఎన్ ఆదిత్య మనసంతా నువ్వే అనే ఓ ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించి సంచలనం సృష్టించాడు. ఉదయ్ కిరణ్ సరసన రీమాసేన్ నటించగా... ఈ సినిమా ఘన విజయం సాధించింది. పైసా బ్లాక్ బాస్టర్ హిట్లు చిత్రం, నువ్వు నేను సినిమాల తర్వాత మనసంతా నువ్వే చిత్రం కూడా ఘన విజయం సాధించి ఉదయ్ కిరణ్ కి హ్యాట్రిక్ పెట్టింది. ఈ మూడు సినిమాలకి సంగీత బాణీలు అందించింది ఆర్ పి పట్నాయక్.
4. నీ స్నేహం
2002 లో విడుదలైన నీ స్నేహం చిత్రంలో ఉదయ్ కిరణ్, జతిన్ గర్హ్వాల్, ఆర్తి అగర్వాల్ ప్రధాన పాత్రలలో నటించారు. ఫ్రెండ్షిప్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. పరుచూరి మురళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో నటించిన ఉదయ్ కిరణ్ కి రెండవ ఫిలిం ఫేర్ బెస్ట్ యాక్టర్ అవార్డు లభించింది.
5. కలుసుకోవాలని
2002వ సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రంలో గజాల నటించింది. ఈ చిత్రం కూడా ఉదయ్ కిరణ్ కి ఒక హిట్టు తెచ్చిపెట్టింది. ఏది ఏమైనా అతి తక్కువ సమయంలోనే రెండు ఫిలిం ఫేర్ ఉత్తమ నటుడిగా అవార్డులు అందుకున్న ఉదయ్ కిరణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.