పెళ్లిచూపుల్లోనే ప్రేమలో పడ్డ త్రివిక్రమ్..!!
టాలీవుడ్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.. రచయితగా ఇండస్ట్రీలో అడుగు పెట్టి.. ఆ తర్వాత దర్శకుడిగా మారి తనదైన మార్క్ చూపించాడీయన. మాటల్లో మ్యాజిక్.. డైలాగులో పంచ్.. ఇదే ఈయనను స్టార్ రైటర్ గా ప్రేక్షకులకు దగ్గర చేసింది. పంచ్ మరియు ప్రాస కలబోసినా డైలాగ్స్ వినగానే అందరికీ గుర్తుకు వచ్చేది త్రివిక్రమే అన్న స్థాయికి ఎదిగాడు. ఈయన సినిమాలో ప్రతి డైలాగ్ ఏ రేంజ్లో పేలతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చేసినవి కొద్ది సినిమాలే అయినప్పటికీ టాప్ డైరెక్టర్ లలో ఒకడిగా నిలిచాడు.
అయితే త్రివిక్రమ్ సినీ కెరీర్ గురించి తెలిసినంతగా అతని కుటుంబం గురించి ఎవరికీ తెలియదు. ముఖ్యంగా ఆయన లవ్ స్టోరి చాలా తక్కువ మందికే తెలుసని చెప్పాలి. వాస్తవానికి త్రివిక్రమ్ లవ్ స్టోరి తెలిస్తే ఓ సినిమాని తలపించే విధంగా ఉంటుంది. త్రివిక్రమ్ ప్రేమ కథ పెళ్లిచూపుల్లోనే జరిగింది. అది కూడా ఈయన పెళ్లిచూపుల్లోనే. ప్రముఖ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రిగారి సోదరుడికి ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తెను పెళ్లిచూపులు చూసేందుకు రావాల్సి ఉందని కోరగా వెళ్లిన మాటల మాంత్రికుడు. అయితే అక్కడ త్రివిక్రమ్ అక్కకు బదులుగా చెల్లి సౌజన్యని చూసి ఫ్లాట్ అయిపోయాడు.
తొలి చూపులోనే సౌజన్యను చూసి ప్రేమలో పడ్డాడు త్రివిక్రమ్. అంతేకాదు.. ఆ పెళ్లిచూపుల్లోనూ సౌజన్య నాకు బాగా నచ్చిందని.. ఆమె పెళ్లి చేసుకుంటానని చెప్పేశాడట. త్రివిక్రమ్ మాటలకు అక్కడ ఉన్న వాళ్లు అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారట. ఇక చివరకు మంచి సంబంధం, సీతారామశాస్త్రికి బాగా నచ్చిన వ్యక్తి, ఎలాంటి చెడు అలవాట్లు లేని అబ్బాయి కావడంతో వారు కూడా ఇందుకు ఒప్పుకున్నారట. కానీ, పెద్ద కూతురు పెళ్లి అయ్యేంత వరకు వేచి ఉండాల్సిందిగా త్రివిక్రమ్‌కు షరతు విధించారు. ఇక షరతు ప్రకారమే పెద్ద కూతురు పెళ్లి అయ్యాక.. సౌజన్యను పెళ్లి చేసుకున్నాడు త్రివిక్రమ్. ప్రస్తుతం ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.