'ఆమెను హాలీవుడ్ నటిలా భావిస్తాను'..సైఫ్ అలీఖాన్!!
బాలీవుడ్ తారలు మరియు నిజ జీవిత జంట అయిన కరీనా కపూర్ మరియు సైఫ్ అలీ ఖాన్ లు ఓ మీడియా జరిపిన ఇంటర్వ్యూలో ఒకరినొకరు పొగడ్తలతో ముంచెత్తుకున్నారు. ఇలాంటి అవకాశాలను వీరు ఎప్పుడూ వదులుకోరు. ఇలాంటి సందర్భమే ఓ ప్రముఖ న్యూస్ పోర్టల్ వీరికి కలిపించింది. ఆ ప్రముఖ న్యూస్ పోర్టల్ ఏర్పాటుచేసిన ఈ ఇ-కాన్లేవ్ సందర్భంగా మీడియా ముందు ఒకరినొకరు ప్రశంసించు కొన్నారు. అయితే సైఫ్ అలీ ఖాన్ ..కరీనా కపూర్ గురించి 'ఆమెను నేను ఓ హాలీవుడ్ స్టార్ లాగా భావిస్తున్నాను' మరియు 'ఆమె ప్రవర్తన బాలీవుడ్ స్టార్ల మాదిరిగా ఉంటుందని' ఈ సందర్భంగా తెలియజేశాడు.
కరీనా ప్రొఫెషనల్ కెరీర్ లో నిశ్శబ్దంగా ఉంటుందని మరియు చాలా మంచిదని సైఫ్ తెలియజేశాడు. ఉడ్తా పంజాబ్ సినిమాలో ఆలియా భట్ మరియు కరీనా కపూర్ ఇద్దరూ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తూ మంచి నటనను ఈ చిత్రం ద్వారా అందించారు అని సైఫ్ అలీ ఖాన్ తెలియజేశాడు. 'వీరే డి వెడ్డింగ్' సినిమాలో కరీనా తన గ్లామర్ తో మంచి నటనను ప్రేక్షకులకు పంచింది అని సైఫ్ అన్నాడు. అంగ్రేజీ మీడియం సినిమాలో ఓ చిన్న పాత్ర ద్వారా ప్రజలను మెప్పించింది అని సైఫ్ పొగిడాడు.
ఏజెంట్ వినోద్ సినిమాలో ఇద్దరు భార్యాభర్తలు కూడా మంచి నటనను కనబరిచారని ఒకరినొకరు పొగుడుకున్నారు. ఈ సందర్భంగా కరీనా సూపర్ కూల్ అని చెప్పాడు. ఈ లాక్ డౌన్ సమయంలో అతనిని ఉడికించడానికి మంచి దుస్తులు ధరించమని ప్రోత్సహిస్తోందని సైఫ్ తెలిపాడు. తాను దిల్ చాహతా హై సినిమాలో సహాయ నటుడి పాత్రలో నటించినప్పుడు నాకు స్పృహ వచ్చింది ఎందుకంటే దిల్ చాహతా హై సినిమాలో నటించినప్పుడు అమీర్ ఖాన్ మరియు అక్షయ్ ఖన్నా ల గురించే అందరూ ఎక్కువగా మాట్లాడుకునే వారు. కానీ ఆ సమయంలో నేను పవర్ ఫుల్ నటుల మధ్య నటిస్తున్నానని రియలైజ్ అయ్యాను.అన్నాడు ...