ఈ కమెడియన్ పెళ్లికి సిద్దమా?
తెలుగు బుల్లితెరపై ఎంతో మంది ప్రేక్షకులను తమ కామెడీతో కట్టిపడేస్తుంది జబర్దస్త కామెడీ షో. ఏడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ కామెడీ ఇప్పటికీ కొత్త కొత్త కంటెంట్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తుంది. జబర్ధస్త్ కామెడీ పుణ్యమా అని ఎంతో మంది కళాకారుల మంచి పొజీషన్లోకి వచ్చారు. జబర్ధస్త్ లో తమ సత్తా చాటిన వారు ఇప్పుడు వెండితెరపై రాణిస్తున్నారు. వెణు, ధన్ రాజ్, తాగుబోతు రమేష్, సత్య, చమ్మక్ చంద్ర ఇలా ఎంతో మంది తమదైన కామెడీ మార్క్ చాటుకుంటున్నారు. ప్రస్తుతం జబర్ధస్త్ అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది హైపర్ ఆది. మనోడి టీమ్ లో రైజింగ్ రాజు, దొరబాబు కామెడీ అదిరిపోతుంది.
హైపర్ ఆది స్కిట్ అనగానే కామెడీ పంచ్ లు అని అంటారు. అదిరే అభి టీమ్ లో జూనియర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించి, స్క్రిప్ట్ రైటర్‌గా టీమ్ లీడర్ స్థాయికి ఎదిగాడు హైపర్ ఆది. ఇప్పుడు జబర్ధస్త్ షోలో చెప్పుకోదగ్గ టీమ్ అంటే సుడిగాలి సుధీర్, హైపర్ ఆది మాత్రమే అంటారు. బుల్లితెరపై తనదైన పంచులతో అనతి కాలంలోనే అగ్రస్థానాన్ని అందుకున్నాడు హైపర్ ఆది. ఇప్పుడు జబర్ధస్త్ టీం లీడర్స్ లో అత్యంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఇతనికే ఉంది. ఆ మధ్య అనసూయతో చనువుగా ఉంటున్నాడని వార్తలు రాగా, ఇటీవల యాంకర్ వర్షిణితో ప్రేమాయణం నడుపుతున్నాడని పుకార్లు పుట్టించారు.
మరోవైపు అలాగే తన కంటే ముందు యాంకర్ ప్రదీప్, సుడిగాలి సుధీర్ పెళ్లి అయితేనే తాను కూడా పెళ్లి చేసుకుంటానని మొండి పట్టుదల పట్టాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు మనోడికి పూర్తిగా పెళ్లిపై ధ్యాస మళ్లినట్టుంది. తమ తల్లితండ్రులు ఒక అమ్మాయిని వెతికారని, ఆమెది సొంత జిల్లా ప్రకాశం అని చెప్పుకొచ్చాడు ఆది. వచ్చే ఏడాది తమ పెళ్లి ఉంటుందనే విషయం కూడా చెప్పి , తన ఫ్యాన్స్‌కి శుభవార్త అందించాడు.