బాలీవుడ్ బర్త్ డే బాయ్ : వరుణ్ ధావన్
వరుణ్ ధవన్.. ఈ బాలీవుడ్ స్టార్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. హీరోగా పరిచయమైన దగ్గర్నుంచి లవర్ బాయ్‌గానే యాక్ట్ చేస్తున్న ఈ యంగ్ స్టార్‌కు ఫ్యాన్ ఫాలోంగ్ కూడా ఓ రేంజ్‌లోనే ఉంది. ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీసి శ్రీమంతుడిగా మారిన దర్శకుడు డేవిడ్ ధావన్ కుమారుడు ఈ వరుణ్ ధవన్. వాస్తవానికి వరుణ్ ధావన్ ప్రాధమికంగా డాన్సర్. మిమిక్రీ కూడా చాలా బాగా చేస్తాడు. మిథున్ చక్రవర్తిని బాగా ఇమిటేట్ చేస్తాడు. అయితే 2010లో `మై నేమ్ ఈజ్ ఖాన్` సినిమాకు కరణ్ జోహార్ దగ్గర వరుణ్ ధావన్ సహాయ దర్శకునిగా పనిచేశారు.
ఆ టైమ్‌లో అతడు కష్టపడి పని చేస్తున్న పద్ధతిని చూసిన షారూక్ ఒకరోజు పిలిచి ‘నీకు డైరెక్షన్ కంటే యాక్టింగే బెటర్’ అని సలహా ఇచ్చాడు. కొన్నాళ్లకు వరుణ్ ధావన్ యాక్టర్ అయ్యాడు. 2012లో కరణ్ దర్శకత్వంలో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేశారు ఆయన. ఈ సినిమాకి ఫిలింఫేర్ బెస్ట్ మేల్ డెబ్యూ నామినేషన్ పొందారు వరుణ్. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో నటించి బాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతేనా? షారూక్‌ఖాన్ పక్కన ‘దిల్వాలే’లో సరిజోడుగా నటించాడు. అలాగే వరుణ్ ధావన్ బర్త్‌డే నేడు.
ధావన్ పంజాబీ హిందూ కుటుంబంలో 24 ఏప్రిల్ 1987న జన్మించారు. ఆయన తండ్రి ప్రముఖ దర్శకుడు డేవిడ్ ధావన్, తల్లి కరుణ ధావన్. యుకె లోని నాటిన్మం ట్రెంట్ విశ్వవిద్యాలయంలో బిజినెస్ మేనేజ్మెంట్ చదువుకున్నారు. ఆ తర్వాత నటుడిగా మారి.. బాలీవుడ్లో తన సత్తా చాటాడు. నేడు ఈయనది పుట్టిన రోజు. అయితే ప్రస్తుతం కరోనా ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేస్తుంది. దీంతో పలు దేశాలు లాక్డౌన్ విధించాయి. అందులో భారత్ కూడా ఒకటి. దీంతో సామాన్యులతో పాటు సినీ ప్రముఖులు కూడా ఇంటిపట్టునే ఉన్నారు. ఈ క్రమంలోనే వరుణ్ ధావన్ తన బర్త్‌డేను కుటుంబ సభ్యులతోనే సింపుల్‌గా జరుపుకోనున్నట్టు తెలుస్తోంది.
Whenever he’s on-screen, the audience goes #SabBadhiyaHai 🤩 #HappyBirthdayVarunDhawan | @Varun_dvn pic.twitter.com/8hB5KWrBgi — Yash Raj Films (@yrf) April 24, 2020