ఈ పాత్రలలో సమంత జీవించేసింది..!

Durga Writes

సమంత.. ఓ అద్భుత నటి. ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసిన భామ.. నటించమంటే జీవించేస్తుంది.. అంత గొప్ప నటి.. ఇంకా అలాంటి ఈ నటి కొన్ని పాత్రలలో నటించింది.. అయితే ఆ పాత్రలు అన్ని కూడా సమంత కోసమే పుట్టాయి ఏమో.. మరో నటి అయితే ఇంత గొప్పగా నటించలేదు అనే ఫీలింగ్ తీసుకొచ్చాయి అంటే నమ్మండి. ఇంకా అలా ఫీలింగ్ తీసుకొచ్చిన పాత్రలు ఏంటి అనేది ఇక్కడ చదివి తెలుసుకోండి.. 

 

అమృత.. రాజు గారి గది  

 

సొసైటీలో కొందరు చేసిన దారుణమైన పనులకు ఒక అమ్మాయి ఎలా విక్టిమ్ అయింది అనే అమృత రోల్ లో సమంత నటన అద్భుతం. 

 

తార.. మెర్సల్ 

 

పాత్ర నిడివి తక్కువ అయినప్పటికీ మంచి యాంకర్ గా, గ్లామరస్ రోల్ లో సమంత అద్బుతంగా నటించింది.. 

 

రామలక్ష్మి.. రంగస్థలం

 

అసలు ఈ సినిమా చూసేవరుకూ తెలీదు.. సమంతలో ఈ యాంగిల్ కూడా ఉంది అని.. డీ గ్లామర్ రోల్  లో పల్లెటూరు అమ్మాయిలా రామ లక్ష్మి నటన అమోగం అంటే నమ్మండి.. ఈ పాత్ర ఆమె కెరీర్ లోనే బెస్ట్ అనడం ఏలాంటి సందేహం లేదు. 

 

మధురవాణి.. మహానటి 

 

మధురవాణి.. పాత్ర పేరే ఎంతో మధురంగా ఉంది.. ఇంకా పాత్ర ఉండదా.. అవును పాత్ర కూడా చాలా మధురంగా ఉంటుంది.. మహానటి సినిమాలో పాత్ర నిడివి తక్కువ అయినప్పటికీ సినిమాకు చాలా ముఖ్యం. పైగా మహానటి సావిత్రి గారి కథ చెప్పే పాత్ర అది.. 

 

రాతి దేవి.. అభిమన్యుడు

 

విశాల్ హీరోగా సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో సమంత పాత్ర చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. 

 

సుందంతిరా సెల్వి.. సీమ రాజు 

 

శివ కార్తికేయన్ సరసన అచ్చమైన తమిళ్ అమ్మాయి పాత్రలో అద్భుతంగా నటించింది. 

 

రచన.. యు-టర్న్ 

 

ఈ సినిమా అంత కూడా హీరోయిన్ ఓరియెంటెడ్ స్క్రిప్ట్.. ఇంకా స్టోరీ కూడా యు-టర్న్.. ఈ కన్నడ రీమేక్ సినిమాలో రచన పాత్రలో సమంత జీవించేసింది..

 

వాయంబు.. సూపర్ డీలక్స్ 

 

వాయంబు... పేరునే డిఫరెంట్ గా ఉంది కదా! ఈ సినిమాలో సమంత క్యారెక్టర్ కూడా అలానే డిఫరెంట్ గా ఉంటుంది. 

 

శ్రావణి.. మజిలీ 

 

నిజంగానే.. ఈ మజిలీ సినిమాలో భార్య పాత్రలో నటించిన సమంత.. ఎంతో అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేసింది.. ఈ సినిమాలో సమంతను చుసిన ప్రేక్షకులు మాకు ఇంత ప్రేమించే భార్య ఉంటే బాగుండు అని అనిపించేలా సమంత ఈ పాత్రలో నటించింది. 

 

స్వాతి..ఓ బేబీ

 

నిజంగా సమంత ఈ సినిమాలో జీవించేసింది.. ఒక ముసలవిగా పడుచు పిల్లలాగా మారితే ఎలా ఉంటాదో నిజంగా  అలానే చేసింది సమంత.. ఇంకా చెప్పాలి అంటే ఎక్కువ చేసింది.. వయసులో ఉన్నప్పుడే అన్ని తినేయాలి అబ్బాయ్.. ముసలోడివి అయ్యాక ఏం తిన్న గ్యాస్ ట్రబుల్ వస్తుంది అంటూ చెప్పే డైలాగ్స్ ఇప్పటికి చెవులలో తిరుగుతూనే ఉన్నాయ్. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: