టాలీవుడ్ స్టార్ హీరోల ఫోకస్ అంతా కోలీవుడ్ పైనే.. !
టాలీవుడ్ స్టార్లు తమిళ మార్కెట్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. కోలీవుడ్ ని సెకండ్ మార్కెట్ గా మలుచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడ సాలిడ్ ప్లేస్ అందుకునేందుకు తమిళ స్టార్ల సాయం తీసుకుంటున్నారు. వాళ్ల సపోర్ట్ తో వాళ్ల మార్కెట్ లోనే జెండా పాతాలని ట్రై చేస్తున్నారు.
మహేశ్ బాబు నుంచి మొదలుపెడితే అల్లు అర్జున్ వరకు టాలీవుడ్ స్టార్లంతా మార్కెట్ పెంచుకునే పనిలో ఉన్నారు. ముఖ్యంగా సౌత్ స్టార్స్ అనిపిించుకునేందుకు చాలా కష్టపడుతున్నారు. పక్కనున్న కోలీవుడ్ లోనూ స్టార్డమ్ తెచ్చుకునే పనిలో పడ్డారు. అందుకే అల్లు అర్జున్ పుష్ప సిినిమాకు తమిళ స్టార్ విజయ్ సేతుపతిని విలన్ గా తీసుకున్నాడు. మక్కల్ సెల్వన్ ఇమేజ్ తో పుష్ప మార్కెట్ పెంచే ప్రయత్నం చేస్తున్నాడు.
పవన్ కళ్యాణ్-క్రిష్ కాంబినేషన్ లో ఓ పాన్ ఇండియన్ మూవీ వస్తోంది. ఇందులో తమిళ స్టార్ శివ కార్తికేయన్ ఓ కీరోల్ ప్లే చేస్తాడనే ప్రచారం జరుగుతోంది. డిఫరెంట్ స్టీరీస్ తో తమిళనాట మంచి ఇమేజ్ తెచ్చుకున్న ఈ హీరోను తీసుకుంటే కోలీవుడ్ కు ప్లస్ అవుతాడని లెక్కలేసుకున్నారట దర్శక నిర్మాతలు. ఇక ఇంతకుముందు కౌసల్య కృష్ణ మూర్తి సినిమాలోనూ ఓ స్పెషల్ రోల్ ప్లే చేశాడు శివ కార్తికేయన్.
రాజమౌళికి ఇప్పుడు ఇండియా వైడ్ గా ఫాలోయింగ్ ఉంది. జక్కన్న సినిమా అనే ట్యాగ్ తో భారీ బిజినెస్ జరుగుతోంది. అయినా ఎక్కడా ఛాన్స్ తీసుకోకుండా ట్రిపుల్ ఆర్ కు తమిళ కోటింగ్ ఇచ్చాడు. ఓ సపోర్టింగ్ రోల్ కోసం డైరెక్టర్ కమ్ యాక్టర్ సముద్రఖనిని తీసుకున్నాడు రాజమౌళి.
తమిళ హీరోలు ఎప్పుడూ టాలీవుడ్ ను టార్గెట్ చేస్తూనే ఉంటారు. ఇక్కడ సాలిడ్ మార్కెట్ సంపాదించుకునేందుకు డబ్బింగ్ సినిమాలతో బరిలోకి దిగుతుంటారు. అయితే మనవాళ్లు మాత్రం బైలింగ్వల్స్, పాన్ ఇండియన్ మూవీస్ తో చెన్నైలో అడుగుపెడుతున్నారు. తంబీల్లో ఫాలోయింగ్ తెచ్చుకునేందుకు కష్టపడుతున్నారు.
మహేశ్ బాబు లుక్ లో పాన్ ఇండియన్ అప్పీరియన్స్ కనిపిస్తుంది గానీ.. ార్కెట్ మాత్రం టాలీవుడ్ ను దాటడం లేదు. అయితే తెలుగునాట సూపర్ స్టార్ అనిపించుకున్న ఈ హీరో తమిళ తంబీలను ఇంప్రెస్ చేసేందుకు మురుగదాస్ దర్శకత్వంలో బైలింగ్వల్ మూవీ స్పైడర్ చేశాడు. ఇక ఈ సినిమాకు తమిళ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఎస్.జె.సూర్యను విలన్ గా తీసుకున్నాడు. అయితే మార్కెట్ లెక్కలు చూసుకొని ఈ సినిమా మహేశ్ ఆశలు తీర్చలేకపోయింది.
చిరంజీవి కూడా సైరా సినిమాతో మార్కెట్ విస్తరించుకొనే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగానే తమిళనాడు నుంచి విజయ్ సేతుపతిని తీసుకున్నాడు. ఈ తమిళస్టార్ కు రాజపాండి పాత్ర ఇచ్చాడు. ఇక వీళ్ల రూట్ లోనే అరుణ్ విజయ్ లాంటి యంగ్ హీరోస్ ను కూడా తెలుగు సినిమాల్లోకి తీసుకొస్తున్నారు.