బాక్గ్రౌండ్ ఉంటే అలా చేయాల్సిన పనిలేదు... కానీ కొత్త వాళ్లకు తప్పదు : కృతి సనన్
కొంత మందికి సినిమా ఇండస్ట్రీ అంటే పిచ్చి. అయితే సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉంటే సినిమా ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వడం నిలదొక్కుకోవడం కాస్త సులువైన పని కానీ... ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకపోతే మాత్రం సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వడం ఒకెత్తయితే సినిమా ఇండస్ట్రీలో నిలుదొక్కుకోవటం మరో ఎత్తు. దీని కోసం ఎంతోమంది ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు. ఇక ప్రస్తుత జనరేషన్ లో ఇలా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనదైన గుర్తింపు సంపాదిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. అయితే తాజాగా ఇలాంటి వ్యాఖ్యలే చేసింది బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతి సనన్. ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు కూడా కొసమెరుపు.
వన్ నేనొక్కడినే సినిమాతో పాటు అటు నాగచైతన్య సరసన కూడా ఓ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత బాలీవుడ్లో ఎక్కువగా అవకాశాలు రావడంతో అక్కడే బిజీ బిజీ అయిపోయింది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ కి హాజరైన కృతి సనన్ ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించింది నిలదొక్కుకోవడం అంటే మాటలు కాదు అంటూ చెప్పుకొచ్చింది. ఎన్నో భయాలను ఆటుపోట్లను అధిగమిస్తేనే నిలదొక్కుకోగలం అంటూ హీరోయిన్ కృతిసనన్ తెలిపింది. తాను కూడా ఎన్నో కష్టాలు పడి ప్రస్తుతం గుర్తింపు సంపాదించాను అంటూ చెప్పుకొచ్చింది కృతిసనన్.
తాను ముంబైకి వచ్చిన కొత్తలో తనకి ఎవరూ ఇక్కడ తెలియదని. ఇక్కడకు వచ్చిన తర్వాతనే అన్ని విషయాలను మెల్లమెల్లగా తెలుసుకున్నాను అంటూ కృతిసనన్ తెలిపింది. ప్రతి విషయంలో మనల్ని జడ్జ్ చేస్తారు. నువ్వు అలా ఉండు ఇలా ఉండు అని ఎంతో మంది సలహాలు ఇస్తారు.వారు చెబుతున్న మాటలు చూస్తుంటే కొన్ని కొన్ని సార్లు మనం సినిమా కి పనికొస్తామా అనే అనుమానం వస్తోంది. ఇవన్నీ ఎదుర్కొని సినీ పరిశ్రమలో నిలదొక్కుకోవాల్సి ఉంటుంది. కానీ స్టార్ కిడ్స్ కి ఇలాంటి బాధలు ఏవీ ఉండవు మొదటి సినిమా విడుదల కాకముందే రెండవ సినిమా ఛాన్స్ వచ్చేస్తుంది అంటూ చెప్పుకొచ్చింది కృతి సనన్.