OTT లో విడుదలైన " అమృతరామమ్ " పరిస్థితేంటి ...?

Suma Kallamadi

ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ చాపకింద నీరులాగా విజృంభిస్తుంది. ఈ తరుణంలో దేశవ్యాప్తంగా గత నెలన్నర రోజుల నుంచి లాక్ డౌన్ విధానం అమలు అవుతూనే వస్తుంది. అంతే కాకుండా ఈ విధానం అమల్లో ఉన్న కూడా దేశవ్యాప్తంగా రోజురోజుకీ కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఈ ప్రభావం ఇండస్ట్రీలపై, సినిమా థియేటర్లపై బాగా పడింది అనే చెప్పాలి. ఒకవేళ లాక్ డౌన్ విధానాన్ని ఎత్తివేసిన.. సినిమా థియేటర్లు మాత్రం కొన్ని నిబంధనలు పాటిస్తూ జరుపుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయంటున్నారు. 

 


అంతే కాకుండా ఈ సంవత్సరం పెద్ద సినిమాలు విడుదల చేయడం కూడా అసాధ్యంగానే కనిపిస్తుంది. ఇక ఈ తరుణంలో OTT ప్లాట్ ఫామ్ చెక్కు చెదరకుండా పరుగులు తీస్తుందని అనే చెప్పాలి. అంతే కాకుండా ఇప్పటి వరకు షూటింగ్ లు అన్నీ పూర్తి చేసుకుని రెడీగా ఉన్న సినిమాలు అన్నీ కూడా వాటిపై విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం థియేటర్లలో విడుదల చేయలేము కనీసం OTT లో అయిన విడుదల చేస్తే మంచిది అని కొందరు నిర్మాతలు OTT లో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నారని చెప్పాలి. 

 


ఇక OTT లో మొదట రిలీజ్ అయిన సినిమా అమృతా రామన్. ఇంకా ZEE 5 యాప్ లో రిలీజ్ అయిన ఈ సినిమా ప్రేక్షకులలో కాస్త అసహనం వ్యక్తం చేస్తుంది. అంతే కాకుండా రిలీజ్ అయిన వెంటనే పెద్ద ఎత్తున ప్రేక్షకులు సినిమాని చూడడం జరిగింది. కానీ ఈ సినిమా ప్రేక్షకుల సహనాన్ని పరీక్ష పెట్టింది అనే చెప్పాలి. అంతే కాకుండా ఈ సినిమా రొటీన్ కదా.. బోరింగ్ గా ఉండడంతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఈ సినిమా తక్కువ సమయం ఉన్నప్పటికీ కూడా ప్రేక్షకులు మొత్తం సినిమా చూడకుండానే  క్లోజ్ చేశారు చాలా వరకు. మొత్తానికి ఈ సినిమాలో నటించిన రామ్ రంగనాయకులు ఒక రకంగా ఏం చేసినా కానీ మిగతా వారందరూ కూడా పెద్ద నటన చూపించలేదు అనే చెప్పాలి. మొత్తానికి OTT లో రిలీజ్ చేసిన ఈ సినిమా విఫలం అవ్వడం జరిగింది. ఆరంభ దశలో ఇలా మీరు నిరుత్సహపరిచిన కానీ భవిష్యత్తులో ఎలా ఉంటుందో అని ఆసక్తిగా ఎదురు చూడటం మొదలుపెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: