రిషి కపూర్ కుటుంబం తో గడిపిన అరుదైన ఫోటోలు..?
బాలీవుడ్లోని లెజెండరీ నటుల్లో ఒకరైన శశి కపూర్ మరణంపై బాలీవుడ్ చిత్ర పరిశ్రమ ను విషాదం లోకి నెట్టేసింది అన్న విషయం తెలిసిందే. నిన్న గొప్ప నటుడు ఇర్ఫాన్ ఖాన్ మరణాన్ని మరువకముందే ఈ రోజు మరో లెజెండరీ నటుడు రిషి కపూర్ మరణించడంతో భారత చిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా రిషి కపూర్ మరణం అందరిని షాక్ కి గురిచేసింది. గత కొన్ని నెలల నుంచి క్యాన్సర్ వ్యాధి బారిన పడి ఈ మహమ్మారి తో పోరాడుతున్న రిషీకపూర్ బుధవారం ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రిలో చేరారు. ఇక గురువారం ఉదయం ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు.
ఆయన మరణంతో భారత చిత్ర పరిశ్రమ మొత్తం ఒక్క సారిగా షాక్ కు గురయింది. ఇక రిషి కపూర్ మరణానికి సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. అయితే రిషి కపూర్ మరణంపై కేవలం బాలీవుడ్ ప్రముఖులు మాత్రమే కాదు వివిధ భాషలకు చెందిన సినిమా ఇండస్ట్రీలకు చెందిన ప్రముఖులు సంతాపం తెలియజేస్తూ రిషి కపూర్ తో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. రిషి కపూర్ బాలీవుడ్ యొక్క ప్రముఖ కపూర్ కుటుంబానికి చెందినవారు. కపూర్ కుటుంబం హిందీ చిత్రాల మొదటి కుటుంబం అని విస్తృతంగా పిలుస్తారు. దివంగత దిగ్గజ నటుడు చిత్ర నిర్మాత అయిన రాజ్ కుమార్ కుమారుడు రిషికపూర్. అతని మేనమామ లు శశి కపూర్ కూడా బాలీవుడ్ లో దిగ్గజ నటుడి గానే కొనసాగుతున్నారు.
ఇక వారి కుమారులు రణబీర్ మరియు రాజీవ్ కపూర్ కూడా ప్రస్తుతం స్టార్ హీరోల గానే కొనసాగుతున్నారు. అయితే రిషీకపూర్ మరణం ఎంతో మందిని కలిచి వేసింది అనే విషయం తెలిసిందే. అయితే తాజాగా దిగ్గజ నటుడు అయిన రిషి కపూర్ జీవితానికి సంబంధించి పలు వ్యక్తిగత అమూల్యమైన ఫోటోలు సోషల్ మీడియాలో అభిమానులను ఆకర్షిస్తున్నాయి. రిషి కపూర్ తన కుమారుడు రణవీర్ మరియు భార్య నీతూ కపూర్ తో కలిసి గడిపిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానులకు చెరగని గుర్తుగా మారిపోయాయి.