రష్మిక మందన్నకి ఇంత చిన్న చెల్లెలా.. అవాక్కవుతున్న నెటిజన్లు..?

praveen

తెలుగు చిత్ర పరిశ్రమలో రష్మిక మందన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చలో సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైన ఈ అమ్మడు తన అందం అభినయంతో ఎంతోమంది దర్శక నిర్మాతలను ఆకర్షించి  వరుస  అవకాశాలను దక్కించుకుంది . ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోయిన్ గా దూసుకుపోతుంది ఈ ముద్దు గుమ్మ . ఎక్కడ అందాల ఆరబోత చేయకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను మాత్రమే చేసుకుంటూ తెలుగు ప్రేక్షకులను ఆకర్షిస్తున్నది  రష్మిక మందన. మొదటి సినిమాతోనే మంచి విజయం సాధించడంతో ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు రష్మిక మందన. 

 

 

 

 ఆ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన గీత గోవిందం సినిమా విజయం సాధించడంతో రష్మిక క్రేజ్  ఎక్కడికో  వెళ్ళిపోయింది. ఇక ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. మొన్నటికి మొన్న ఏకంగా సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలో ఛాన్స్ కొట్టేసింది రష్మిక మందన్న. సరిలేరు నీకెవ్వరు సినిమాలో మహేష్ బాబు సరసన నటించి తన క్యూట్ క్యూట్ నటనతో ఎంతో మంది మతి పోగొట్టింది  . ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ బిజీగా ఉన్న హీరోయిన్ లలో ఒకరిగా దూసుకుపోతుంది రష్మిక మందన. 

 

 

 

 ఇదిలా ఉంటే రష్మిక మందన కు సంబంధించి ఇప్పటికీ ప్రేక్షకులకు తెలియనిది ఆశ్చర్యానికి గురి చేసే ఓ విషయం ఉంది. అదేంటి అంటే రష్మిక మందన్న సిస్టర్ గురించి. ప్రస్తుతం టాప్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక మందన కు చిన్ని చెల్లెలు ఉంది . ఆమె వయసు దాదాపు గా 5 ఏళ్ళు ఉండొచ్చు. రష్మిక మందన్న వయసుకి తన చెల్లెలు వయసుకి ఎంతో తేడా ఉంటుంది. అయితే రష్మిక మందన్న చెల్లెలు రేపు పుట్టినరోజు జరుపుకోబోతుండగా  దీనికి సంబంధించిన ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ ఫోటో చూసిన అభిమానులు అందరూ రష్మిక మందన కి ఇంత చిన్న చెల్లెలు ఉందా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఓసారి ఈ ఫోటో చూడండి మీరు కూడా ఆశ్చర్యపోక మానరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: